ఎండాకాలం వీటిని అస్సలు తినకూడదు.. లేదంటే?

Published : Apr 01, 2022, 01:39 PM IST

Summer Avoid Foods :  జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్స్ ఈ వేసవిలో అస్సలు తినకూడదు. వీటిని తినడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో మీరు డీహైడ్రేషన్ కు గురయ్యి.. ప్రాణాల మీదికి రావొచ్చు.   

PREV
110
ఎండాకాలం వీటిని అస్సలు తినకూడదు.. లేదంటే?

 ఎండాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ కాలంలోనే ప్రమాదరకమైన రోగాలు చుట్టుకునే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం మీరు తీసుకుంటున్న ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 

210

ముందే ఎండాకాలం.. విపరీతమైన ఎండలకు శరీరంలో వేడిమి అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. అదే సమయంలో మనం తీసుకునే కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా ఒంట్లో వేడిని అమాంతం పెంచుతాయి. అలాగే నీటి శాతాన్నికూడా తగ్గిస్తాయి. 

310

ఈ వేసవిలో ఎక్కువగా పండ్ల రసాలను, మజ్జిగ, కొబ్బరి నీళ్లను, నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఈ ఎండాకాలం కొన్నిరకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు అనేక జబ్బుల పాలయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

410

ఫ్రిడ్జ్ వాటర్.. ఈ సీజన్ లో బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇంటికి చేరుకోగానే నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి బాటిల్ ఐస్ వాటర్ ను మొత్తంగా తాగేస్తుంటారు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చల్లని నీళ్లను తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ ను అస్సలు తాగకండి. 
 

510

చల్లని వైన్.. మండుతున్న ఎండలకు ఒక్క గ్లాస్ వైన్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో అంటూ ఆల్కహాల్ ను తాగుతుంటారు. కానీ ఈ ఎండలకు మీరు చల్లని ఆల్కహాల్ తాగినా.. మీ బాడీ ఉష్ణోగ్రత మాత్రం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆల్కహాల్ వల్ల మీరు నిర్జలీకరణానికి గురవ్వొచ్చు. దీనివల్ల మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి.. అనేక రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. 

610

జంక్ ఫుడ్స్.. జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కు ఈ కాలంలో ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో ఆయిలీ ఫుడ్స్ తినకూడదు. వీటివల్ల ఒంట్లో వేడి పెరగడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 
 

710

టీ, కాఫీ.. ఎండాకాలంలో టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండాలి. వీటివల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. వీటికి బదులుగా ఐస్ డ్ కాఫీలు, గ్రీన్ టీలను తాడొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

810

డ్రై ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలుచేసేవే అయినా.. ఈ ఎండాకాలంలో వీటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎండు ద్రాక్ష, ఎండు అత్తిపండు, బాదం పప్పులను ఈ కాలంలో తినకపోవడమే బెటర్. ఎందుకంటే వీటి వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు వీటివల్ల మీరు తొందరగా అలసిపోతారు కూడా. 

910

వంటల్లో దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, లవంగాల వాడకాన్ని తగ్గించడమే మంచిది. ఎందుకంటే ఇవి మన ఒంట్లో వేడిని పెంచుతాయి. 
 

1010

వేసవి వచ్చిందంటే చాలు మామిడికాయలను ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఈ సీజన్ నుంచే ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ఈ కాలంలో మామిడికాయలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మామిడి కాయలను ఎక్కువగా తింటే ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుుంది. అలాగే తలనొప్పి, కడుపు నొప్పి, విేచనాలు వంటి సమస్యలను కూడా తెస్తుంది.   

Read more Photos on
click me!

Recommended Stories