చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే..?

First Published Dec 6, 2022, 2:52 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఛాతిలో నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడుస్తున్నప్పుడు మోకాలి నొప్పి వస్తుంది. ఈ  చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. 
 

cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. వీటిలో మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీనిని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ ను ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు.. ఇది ధమనులలో పేరుకుపోతుంది. దీంతో గుండెకు చేరే రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది గుండెపోటుతో సహా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.

cholesterol and heart

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు సాధారణంగా మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొంతమందికి ప్రారంభ దశలో  కాళ్ళలో తిమ్మిరి, కాళ్లలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు దారితీసే రక్త నాళాలలో అడ్డంకి ఉంటే.. ఛాతీ నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడుస్తున్నప్పుడు మోకాలి నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. అందుకే ఇలాంటి సమయంలో కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే  గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాకరమైన వ్యాధులు వస్తాయి. 

high cholesterol

 20 ఏళ్ల వయసు నుంచే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల వారసత్వంగా వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి. దీనిని కన్ఫామ్ చేసుకోవడానికి ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ సహాయపడుతుంది. ఎలాంటి సమస్యలు లేకపోతే ఐదేళ్లకోసారి చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు గుండె జబ్బులు ఉంటే.. ప్రతిఏడాది టెస్ట్ లు చేయించుకోవాల్సి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్ మీట్

సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ ను తినడం తగ్గించాలి. అలాగే కొవ్వులు, స్వీట్లు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి చెడుకొలెస్ట్రాల్ ను బాగా పెంచుతాయి. వీటికి బదులుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తినండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఉండే ఆహారాలను కూడా తినొచ్చు. 
 

వ్యాయామం

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి వ్యాయామం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు తెలుసా? మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఇది హృదయ సంబంధ వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తుంది.
 

smoking

స్మోకింగ్

స్మోకింగ్ ఊపిరితిత్తులను దెబ్బతీయడే కాదు మొత్తం శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే ధూమపానాన్ని మానుకోవడమే మంచిది. స్మోకింగ్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది. ధూమపానం మానేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (హెచ్డిఎల్) పెరుగుతుంది. ఇది కొరోనరీ ధమనులను రక్షిస్తుంది. 
 

ఆరోగ్యకరమైన బరువు

ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. నిజానికి బరువు పెరగడానికి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలున్నాయి. కొంతమంది జన్యుపరంగా కూడా బరువు పెరిగిపోతుంటారు. కానీ ఊబకాయుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఊబకాయల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

click me!