తులసి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుందా? అధ్యయనాలు ఏం వెల్లడిస్తున్నాయంటే..

First Published Dec 6, 2022, 1:56 PM IST

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది శరీరక, మానసిక సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీనిని ఆయుర్వేద ఔషదాల్లో ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. తులసిని సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు పలు అధ్యయనాల ప్రకారం.. తులసి ఒత్తిడి, ఆందోళనతో పాటుగా ఇతర మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. 
 

ఆధునిక శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. ఒత్తిడిని తగ్గించడంలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం.. తులసి మానసిక, శారీరకక ఒత్తిడి, దీనికి సంబంధించిన వ్యాధులను తగ్గించే సామర్థ్యాన్ని పెంచుతుంది. వీటిని నీళ్లలో మరిగించి లేదా టీలో వేసుకుని లేదా ఆకులను నమిలితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

పోషకాల పరంగా చూస్తే.. తులసిని మూలికల రాణి అంటారు. దీనిలో జింక్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి, క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటాయి. తులసిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆందోళనను తగ్గిస్తుంది

తులసి అడాప్టోజెన్గా పనిచేస్తుంది. ఇది శరీరానికి కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ హెర్బ్ సహజంగా ఆందోళనను తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం.. తులసి పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే సమస్యలకు, ఒత్తిడికి గురైనప్పుడు ఓర్పును పెంచడానికి సహాయపడుతుంది. 
 

మెరుగైన నిద్ర

తులసిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. రోజంతా ఒత్తిడి వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోరు. ఈ హెర్బ్ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. దీంతో రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. 
 

మెరుగైన నిద్ర

తులసిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. రోజంతా ఒత్తిడి వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోరు. ఈ హెర్బ్ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. దీంతో రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. 
 

click me!