సెక్స్ విషయంలో... భర్తకు కూడా చెప్పని సీక్రెట్స్ ఇవే....!

First Published | Oct 18, 2022, 2:35 PM IST

ముఖ్యంగా శృంగారం విషయంలో  మహిళల దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయట. వాటిని కనీసం తమ భర్త కు చెప్పడానికి కూడా వారు ఇష్టపడరట. అవేంటో ఓసారి చూద్దాం...

భార్యభర్తల మధ్య సీక్రెట్స్ ఉండకూడదు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ... మనం ఎంత కాదు , ఔను అన్నా... దాదాపు అందరూ తమ భాగస్వామి నుంచి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ముఖ్యంగా శృంగారం విషయంలో  మహిళల దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయట. వాటిని కనీసం తమ భర్త కు చెప్పడానికి కూడా వారు ఇష్టపడరట. అవేంటో ఓసారి చూద్దాం...
 

1.మాజీ తో...

భార్యలు తమ మునుపటి భాగస్వాములతో సెక్స్ ఎలా ఉండేదో వారి భర్తలకు అస్సలు చెప్పరట. తమ భార్య మునుపటి భాగస్వాములతో లైంగిక సంబంధాలు ఎలా ఉండేవి అనే విషయంలో తమ భర్తలు చాలా అసురక్షితంగా ఉండవచ్చని మహిళలు భావిస్తారు. సెక్స్ విషయంలో అభద్రత అనేది నిజమైన సమస్య కావచ్చు. అందుకే వారు చెప్పరు.


2.హస్త ప్రయోగం..

చాలా మంది స్త్రీలకు హస్త ప్రయోగం పై అవగాహన ఉంటుంది. కానీ... ఆ విషయాన్ని మాత్రం వారు బయటపెట్టరు. ప్రతి స్త్రీ హస్తప్రయోగం గురించి భర్తకు చెప్పడం సౌకర్యంగా భావించరు.  అందుకే  చాలామంది భార్యలు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. రోజురోజుకు ప్రపంచం దాని గురించి మరింత తెలుసుకుంటున్నప్పటికీ, మహిళల్లో హస్తప్రయోగం ఎక్కువగా నిషిద్ధంగా పరిగణిస్తూ వస్తున్నారు.


3.బెడ్ పై పనితీరు..

కొన్నిసార్లు, స్త్రీలు తమ భర్తలు బెడ్‌పై ప్రవర్తించే తీరును ఇష్టపడరు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పరు.  గొడవ లేదా సమస్యను సృష్టించకుండా ఉండటానికి వారు తమ కోరికలను రహస్యంగా ఉంచుతారు. శీఘ్ర స్కలనం లేదా అంగస్తంభన వంటి మంచంపై లైంగికంగా పాల్గొనలేనప్పుడు పురుషులు కూడా చాలా అసురక్షితంగా ఉంటారు.


4.భావప్రాప్తి..

కలయికలో పాల్గొన్న ప్రతిసారీ స్త్రీలకు భావప్రాప్తి కలగదు. అది వారిలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ... వారు ఆ విషయం బయట పడకుండా ఉండేందుకు నకిలీ చేస్తూ ఉంటారు.పురుషులతో పోలిస్తే మహిళలు క్లైమాక్స్‌కు చాలా సమయం తీసుకుంటారు. వారికి ఫోర్‌ప్లే అవసరం. కానీ ఆ విషయాన్ని తమ భాగస్వామికి మాత్రం చెప్పరు. తమకు ఏం కావాలో చెప్పడానికి కూడా వారు ఇబ్బందిపడుతూ ఉంటారు.

5.సెక్స్ డ్రైవ్..

కొంతమంది స్త్రీలు చాలా ఎక్కువ సెక్స్ డ్రైవ్ కలిగి ఉంటారు, అది వారి భర్తలకు తెలియదు. వారు చెప్పరు కూడా. ఎందుకంటే... ఆ విషయం తెలిస్తే.. తమను జడ్జ్ చేస్తారని వీరు భయపడుతూ ఉంటారు. అందుకే... తమ సెక్స్ కోరికలను కూడా వారు భర్తకు తెలియజేయరు.

Latest Videos

click me!