రొమ్ము క్యాన్సర్ ఆడవారికే కాదు మగవారికి కూడా వస్తుంది... లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Published : Oct 14, 2022, 02:51 PM IST

రొమ్ము క్యాన్సర్ అనగానే టక్కున ఆడవారే గుర్తొస్తారు. ఎందుకంటే ఇది కేవలం ఆడవారికి మాత్రమే వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇందులో నిజంలేదు. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులకు కూడా రావొచ్చు కాబట్టి..

PREV
15
 రొమ్ము క్యాన్సర్ ఆడవారికే కాదు మగవారికి కూడా  వస్తుంది... లక్షణాలు ఎలా ఉంటాయంటే..
breast cancer

ఆడవారే కాదు మగవారు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ.. దీన్ని లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పురుషుల రొమ్ము కణజాలంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చాలా మంది పురుషులలో రొమ్ము క్యాన్సర్ కేసులు జన్యుపరమైన కారణాల వల్లే సంభవిస్తాయట. కుటుంబ చరిత్ర లేకపోయినప్పటికీ.. దీని బారిన పడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

25

నివేదికల ప్రకారం.. మొత్తం రొమ్ము క్యాన్సర్ కేసులలో 1% మాత్రమే పురుషులు దీని బారిన పడుతున్నారట. 2015 లో పురుషుల రొమ్ము క్యాన్సర్ కేసులు 2,350 నమోదయ్యాయి. వీరిలో 440 మంది ఈ క్యాన్సర్ తో చనిపోయారు. నిజానికి పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందని తెలియకపోవడం వల్ల దీని లక్షణాలను పట్టించుకోరు. రోగం ముదిరిన తర్వాతే హాస్పటల్ కి వెళుతుంటారు. దీనివల్ల కోలుకునే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. 

35

పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

- రొమ్ములో గడ్డలు.. (వాటిని తాకడం ద్వారా తెలుస్తుంది)
- చనుమొనలో నొప్పి 
- రొమ్ము పరిమాణం పెరగడం
- చనుమొనలపై గాయాలు
-  చనుమొనలు తలక్రిందులుగా మారడం
 - రొమ్ము చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి
- రొమ్ము చర్మంపై దురద
- చనుమొన నుంచి స్రావం 
- రొమ్ముల నుంచి రక్తస్రావం 
- రొమ్ము చర్మం రంగు మారడం 
- చనుమొన లేదా రొమ్ముపై దద్దుర్లు

వీటితో పాటుగా విపరీతమైన జ్వరం రావడం, శరీర బలహీనత, అలసట కలగడం సర్వ సాధారణం. పురుషుల్లో ఈ లక్షణాలు ఉన్నట్టైతే వెంటనే వైద్యుల దగ్గరకు వెల్లడం మర్చిపోకూడదు. 
 

45

ఎవరు ప్రమాదంలో ఉన్నారు?

యువకులకు కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. కానీ వయస్సుతో పాటు ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వృషణాల వాపు పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా లేదా బంధువుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లైతే కూడా మీరు ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  
 

55

రొమ్ము క్యాన్సర్ లో నాలుగు దశలుంటాయి. ప్రారంభ దశలోనే దీనిని గుర్తిస్తే.. ఎలాంటి ప్రాణాపాయం ఉండదు.  నాలుగో స్టేజ్ లో దీనిని గుర్తిస్తే.. ప్రాణాంతకంగా మారుతుంది. రొమ్ము క్యాన్సర్  బారిన పడకూడదంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories