ట్యాబ్లెట్ వేసుకోకుండా.. తలనొప్పిని క్షణాల్లో తగ్గించే చిట్కాలు మీకోసం..

Published : Oct 01, 2022, 04:14 PM IST

తలనొప్పి వచ్చిందంటే చాలు నొప్పిని తగ్గించేందుకు మందు బిల్లలు వేసుకుంటుంటారు చాలా మంది. అయితే తలనొప్పిని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకోకుండానే క్షణాల్లో తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..   

PREV
17
ట్యాబ్లెట్ వేసుకోకుండా.. తలనొప్పిని క్షణాల్లో తగ్గించే చిట్కాలు మీకోసం..
headache

తలనొప్పితో బాధపడేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్ల ముందు పనిచేయడం, జ్వరం, జలుబు, అలసట వంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. ఇక ఈ తలనొప్పిని వదిలించుకోవడానికి మందుబిల్లలను మింగుతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పిని తగ్గించేందుకు మందు బిల్లలను వేసుకోవడం వల్ల మీ కాలెయం, మూత్ర పిండాల పై చెడు ప్రభావం పడుతుంది. అందుకే వీటిని వేసుకోకపోవడమే మంచిది. నిజానికి తలనొప్పిని వదిలించుకోవడానికి మెడిసిన్స్ నే యూజ్ చేయక్కర్లేదు. కొన్ని చిట్కాలతో తలనొప్పికి చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.

27


నిమ్మరసం

ఉన్నట్టుండి మీకు తలనొప్పి స్టార్ట్ అయ్యి  నెర్వస్ గా అనిపిస్తే.. వెంటనే గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగండి. ఇది తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. నిజానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన్పపుడు తలనొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ తో పాటుగా తలనొప్పి కూడా తగ్గుతుంది. 
 

37

ఆక్యుప్రెషర్

తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఆక్యుప్రెషర్ పద్దతి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీ రెండు చూపుడు వేళ్ల సహాయంతో మీ నుదిటిని నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా 4 నుంచి 5 నిమిషాల పాటు చేయడం వల్ల తలనొప్పి క్షణాల్లో తగ్గపోతుంది.

47

లవంగాలు

లవంగాలు కూడా తలనొప్పిని క్షణాల్లో తగ్గిస్తాయి.  బాగా తలనొప్పిగా అనిపించినప్పుడు వెంటనే ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని నెమ్మదిగా నమలండి. కావాలనుకుంటే వీటిని సన్నని మంటపై వేయించి ఒక గుడ్డలో కట్టి వాసన చూసినా తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. 

 

57

ఆపిల్

తలనొప్పి మరీ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడితే..  ఒక ఆపిల్ ను కట్ చేసి దానిపై నల్ల ఉప్పు లేదా రెగ్యులర్ సాల్ట్ ను చల్లి తినండి. ఇది ఎంతటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించేస్తుంది. 
 

67

లెమన్ టీ

తలనొప్పి స్టార్ట్ అయితే చాలు టీ లేదా కాఫీని తాగుతుంటారు. నిజానికి వీటికంటే లెమన్ టీ తలనొప్పిని చాలా తొందరగా తగ్గిస్తుంది. ఈ టీలో నిమ్మరసంతో పాటు, కొద్దిగా అల్లం కూడా వేసి మరిగించండి. కావాలనుకుంటే రుచి కోసం దీనిలో తేనెను వేయొచ్చు. ఈ లెమన్ టీ తలనొప్పిని క్షణాల్లో తగ్గిస్తుంది. 
 

77
headache

తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే వారానికి రెండు రోజులు తలకు మసాజ్ చేయండి. ఇందుకోసం లవంగం నూనెను ఉపయోగించండి. లవంగం నూనెలో నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయి. అయినప్పటికీ తగ్గకపోతే మాత్రం వైద్యులను ఖచ్చితంగా సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories