రోజూ అల్లం టీ తాగుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

First Published Oct 1, 2022, 2:46 PM IST

అల్లం రుచిని పెంచుతుంది. అలాగని దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుందన్న ముచ్చట అందరికీ తెలుసు. అందుకే కూరల్లో అల్లాన్నిఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ అల్లాన్ని టీ లో కూడా ఉపయోగిస్తారు. నిజానికి అల్లం టీ టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని ఎక్కువగా తాగుతుంటారు. అల్లాన్ని మోతాదులో తింటే అంతా మంచే జరుగుతుంది కానీ.. మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. 

గుండెల్లో మంట

అల్లాన్ని ఒక నిర్ధిష్ట పరిమాణంలో తీసుకోవడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం తగ్గుతుంది. కానీ అల్లాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. 
 

రక్తస్రావం
 
శీతాకాలంలో అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది శరీరాన్ని వేడిగా ఉంచుతుందని. అల్లంలో యాంటీ ప్లేట్ లెట్స్ ఉంటాయి. అల్లంలో ఉండే ఈ లక్షణాలు రక్తస్రావానికి దారితీస్తాయి. అల్లానికి తోడు నల్ల మిరియాలు, లవంగాలు వంటి మసాలా దినులతో దీన్ని తీసుకుంటే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. 

నీళ్ల విరేచనాలు

అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అంత చెడ్డది కూడా. మోతాదుకు మించి అల్లాన్ని తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అల్లం డయేరియా వచ్చే అవకాశాలను పెంచుతుంది. అల్లాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. 

జీర్ణక్రియ పాడవుతుంది

అల్లాన్ని ఒక పద్దతి ప్రకారం.. కొంత పరిమితిలో తీసుకుంటే  జీర్ణశక్తి పెంచుతుంది. అవసరానికి మించి తీసుకుంటేనే జీర్ణక్రియ పాడవుతుంది. ఇది ఎన్నో రకాల ఉదర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. 
 

click me!