Gas Problem: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే..

Published : Feb 17, 2022, 05:05 PM IST

Gas Problem: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే పెద్ద సమస్య గ్యాస్ . ఈ గ్యాస్ సమస్యతో ఏదీ మనస్ఫూర్తిగా తినలేరు. ఇష్టమైన వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంటుంది. అందులోనూ ఏది తిన్నా.. కడుపు ఇబ్బందిగా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా గ్యాస్ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు.  

PREV
17
Gas Problem: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే..

Gas Problem: ప్రస్తుతం అనేక మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ సమస్యతో వారు ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో మెడిసిన్స్ ను, వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ సమస్య నుంచి కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

27

గ్యాస్ సమస్యను తగ్గించడంలో గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్, వరి అన్నం బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్ రాదు.

37

తాజా పండ్లలో నేరేడు , బత్తాయి, నారింజ, అరటి, కివీ, ద్రాక్ష, పైనాపిల్, స్ట్రాబెర్రీ, నిమ్మపండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. 
 

47

ఇకపోతే కూరగాయల్లో దోసకాయ, టొమాటో, క్యారెట్, మిరియాలు, ఆలుగడ్డ, అల్లం, లెట్యూస్, పాలకూర వంటి వాటితో ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఇట్టే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

57

గ్యాస్ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో మాంసాహారం కూడా బాగా పనిచేస్తుంది. అందులో ఫిష్, చికెన్ మంచి మేలు చేస్తాయి. అలాగే వాల్ నట్స్, పల్లీలు గ్యాస్ సమస్యను తరిమికొడతాయట.

67

గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవారు నీళ్లను వీలైనంత ఎక్కువగా తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మనిషికి పోషకాహారం ఎంత అవసరమో.. నీరు కూడా అంతే అవసరమని చెబుతున్నారు.
 

77

గ్యాస్ సమస్యతో బాధపడేవారు కాలీఫ్లవర్, బీట్ రూట్స్, సోయాబీన్స్, ఉల్లి, వెల్లుల్లి, ప్రోటీన్స్ లో బీన్స్ కు దూరంగా ఉండాలి. అలాగే పియర్, పాస్తా,  ప్రూన్, పాస్తా, చెర్రీస్ ను అస్సలు తినకూడదు. వీటిని తింటే గ్యాస్ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories