relationship: లవ్ లో అబ్బాయిలు చేసే ఈ తప్పులే వారి బ్రేకప్ కు కారణమవుతాయి..

First Published | Feb 17, 2022, 3:49 PM IST

relationship: ప్రేమ ఎంతో అందమైనది. ఊహకు అందని లైఫ్ అదే. అయితే ఈ లవ్ లైఫ్ సాఫీగా సాగాలన్నా.. పెళ్లిదాకా ప్రయాణించాలన్నా వారి మధ్యన అండర్ స్టాండింగ్ అవసరం. అంతకు మించి వారి మధ్యన ఈగోలు అస్సలుకే ఉండకూడదు. మొండిగా ప్రవర్తించకూడదు. అప్పుడే లవ్ రిలేషన్ షిప్ హాయిగా కొనసాగుతుంది. 
 

relationship: లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు కొన్ని తప్పులను సాధారణంగా చేసేస్తుంటారు. అవి వారికి పెద్ద సమస్యలా కనిపించకపోయినా.. అమ్మాయిలకు మాత్రం తెగ చికాకు తెప్పిస్తాయి. వాటి కారణంగా అమ్మాయిలు బ్రేకప్ చెప్పే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయి. 

అబ్బాయిలు చేసే మిస్టేక్స్ వారి గర్ల ఫ్రెండ్ ను దూరం చేసుకుంటున్నాననే వాస్తవాన్ని గ్రహించలేకపోతుంటారు. వారిని అగౌరవించి మాట్లాడటం,  ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వారితో వారిస్తూ ఉండటం, మొరటుగా ప్రవర్తించడం వంటి వాటి వల్ల అమ్మాయిల మనసు మారిపోయే అవకాశం ఉంది. ఈ విషయాలే వారిని మీకు నెమ్మది నెమ్మదిగా దూరం చేస్తాయి. 
 


పైగా చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా, క్షమాపణలు చెప్పకుండా  ఉన్నప్పుడు అమ్మాయిలు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పేస్తుంటారు. వారి మధ్యనున్న బంధాన్ని వదులుకుంటారు. మరి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు చేసే తప్పులేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

నార్సిసిస్టిక్ (Narcissistic): ఎప్పుడూ కంగారుగా ఉండే వ్యక్తి రిలేషన్ షిప్ లో ఎక్కువ కాలం ఉండలేడు. ఎందుకంటే.. తన గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ.. కంగారు కంగారుగా ఉండే.. తన భాగస్వామి గురించి ఎప్పుడు పట్టించుకుంటాడు? తనని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఈ రిలేషన్ షిప్ లో అతను ఫెయిల్ అవ్వడం పక్కాగా ఉంటుంది. ఒక బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి ఇద్దరు అవసరం. ఒకరివల్ల రిలేషన్ షిప్ ఎక్కువు కాలం నిలబడదు. ముఖ్యంగా ఒక అమ్మాయిని లైఫ్ ఫార్టనర్ గా స్వాగతించాలనుకున్నప్పుడు ఆమెను అర్థం చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్ లో ఉంటే వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇలా లేకపోతే ఆమె ఆ రిలేషిప్ ను ఖచ్చితంగా వదులుకుంటుంది.

అబద్దాలు: ప్రేమలో నిజాయితీ ఎంతో ముఖ్యం. ఇది లేకపోతే ఒక బంధం ఎక్కువ కాలం ఉండలేదు. ప్రేమలో విశ్వాసం ఎంతో కీలకమైంది. ఈ రిలేషన్ షిప్ లో చిన్న అబద్దం అయినా అది వారిద్దరి మధ్య అంతులేని దూరాన్ని పెంచుతుంది. అబద్దం చిన్నదైనా, పెద్దదైనా పరిణామాలు మాత్రం పెద్ద మొత్తంలోనే ఉంటాయన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తమ బాయ్ ఫ్రెండ్ తమకు అబద్దాలు చెప్పడాన్ని ఆడవాళ్లు అస్సలు సహించలేరు. ఒక సారి మీరు అబద్దాలు చెప్పి దొరికిపోతే వారు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మలేరు. అదే మీ ఇద్దరి బ్రేకప్ కు కారణమవుతుంది.

సరిగ్గా మాట్లాడకపోవడం: ప్రేమికుల మధ్య మాటలు ఆక్సిజన్ వంటిది. ఈ ఆక్సిజన్ కరువైతే ఆ బంధానికి బ్రేకులు పడ్డట్టే. ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు తమ గురించే గొప్పలు ఎక్కువగా చెప్పుకున్నా.. తమ లవర్ చెప్పేది వినకపోయినా.. అమ్మాయిలు ఆ బంధాన్ని వదులుకోవడమే బెటర్ అనుకుంటారు. కాబట్టి వారితో మీరు ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించకండి. వారికదే ఆనందాన్నిస్తుంది. 
 

వారికి ఏమి ఇష్టమో తెలియదు: ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో అమ్మాయిలకే ఎక్కువగా తెలుస్తుంది. కానీ అబ్బాయిలు మాత్రం ఈ పని అస్సలు చెయ్యరట. అంతేకాదు ప్రేమలో పడ్డ కొత్తలోనే వారి గర్ల ఫ్రెండ్ కు ఒకటో రెండో బహుమతులను ఇస్తుంటారు. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ నుంచి తనకు నచ్చిన వస్తువులను అందుకున్నా.. తమ లవర్లకు ఏది కావాలో, ఏది ఇష్టమో తెలుసుకోరు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు.

సమయం గడపకపోవడం: ప్రేమలో అయినా ..పెళ్లి లైఫ్ లో అన్నా.. ఆడవారితో తగినంత సమయం గడపడం ఎంతో అవసరం. వారికోసం తగినంత సమయాన్ని కేటాయించకపోతే.. మీ బంధం తొందరగా బ్రేకప్ అవ్వడం పక్కా.. ఎందుకంటే ప్రియురాలిని లేదా భార్యను అర్థం చేసుకోవడం కాస్త సమయాన్నికేటాయించకపోవడం పెద్ద తప్పు. వారితో ఎంత సమయం గడిపితే వారి గురించి అంత అర్థం చేసుకుంటారు. వారి భావాలను తెలుసుకోగలుగుతారు. అందుకే వారి కోసం కొంత సమయాన్ని వెచ్చించి మాట్లాడండి. అప్పుడే మీ మధ్య బంధం కలకాలం ఉంటుంది.    

Latest Videos

click me!