రాత్రి సమయంలో ఎక్కువ సేపు సెల్ ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్య అటాక్ చేస్తుంది. దానికి తోడు రాత్రంతా ఫోన్ తోనే కాలక్షేపం చేయడం మళ్లీ పొద్దున్నే దానితోనే రోజును ప్రారంభించడం వల్ల మీ మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీరు మీ రోజు వారి పనులను సక్రమంగా చేసుకోలేరు. ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు పడటం, కోపగించుకోవడం, చేస్తున్న పనిపై శ్రద్ధ చూపకపోవడం , నిస్సత్తువ వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి.