Fridge Hack: మనం ఫ్రిజ్ లో ప్రతిరోజూ పాలు, కూరగయాలు, పండ్లు తెచ్చి పెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఒక గిన్నెడు ఉప్పు పెట్టారా? ఫ్రిజ్ లో ఉప్పు ఎందుకు పెడతాం అనుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మీరు వేల రూపాయలు సేవ్ చేయవచ్చు.
ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిజ్ లేని వాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఎండాకాలంలో పాలు, కూరగాయలు మిగిలిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు.. మనం ఫ్రిజ్ ని వాడుతూ ఉంటాం. అయితే.. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నవారందరూ ఒక చిన్న హ్యాక్ వాడితే అది మరింత బాగా పని చేస్తుంది.
25
కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే...
ఫ్రిజ్ లో పెట్టినా కూడా కొన్ని రకాల కూరగాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఫ్రిజ్ లో తేమ పెరిగినప్పుడు కూరగాయలు తొందరగా కుళ్లిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండేందుకు.. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి కూరగాయల పక్కన పెడితే, అది అదనపు తేమను పీల్చుకుంటుంది. దీంతో కూరగాయలు చాలా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
35
దుర్వాసన రాకూడదంటే....
ఫ్రిజ్‌లో కూరగాయలు, పాలు, పిండి, బ్రెడ్ వంటివి ఒకేచోట పెట్టడం వల్ల కొన్నిసార్లు ఓ రకమైన వింత వాసన వస్తుంది. ఉప్పు నింపిన గిన్నెను ఫ్రిజ్‌లోని ఒక మూలన పెడితే, అది చెడు వాసనను పీల్చుకుని లోపలి గాలిని తాజాగా ఉంచుతుంది.
ఫ్రిజ్‌ను పదేపదే తెరవడం వల్ల బయటి గాలి లోపలికి వెళ్లి తేమ పెరుగుతుంది. దీనివల్ల ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. ఉప్పు ఈ అదనపు తేమను పీల్చుకోవడం వల్ల ఆహారం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది. ఫ్రిజ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది.
55
ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టకూడదంటే...
పాత లేదా సింగిల్ డోర్ ఫ్రిజ్‌లలో ఫ్రీజర్‌లో ఎక్కువగా ఐస్ పేరుకుపోయే సమస్య ఉంటుంది. దీనివల్ల ఫ్రిజ్‌లో స్థలం తగ్గడమే కాకుండా, కూలింగ్ కూడా సరిగా అవ్వదు. ఫ్రీజర్‌ను శుభ్రం చేశాక అక్కడ కొద్దిగా ఉప్పు చల్లితే, పదేపదే ఐస్ గడ్డకట్టే సమస్యను నివారించవచ్చు.
అయితే.. ఫ్రిజ్ లో ఉప్పు గిన్నెను పెట్టినప్పుడు.. ఆ ఉప్పు తేమను పీల్చుకొని తడిగా మారుతుంది. కాబట్టి ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఉప్పు గిన్నె మారుస్తూ ఉండాలి.