Chanakya Niti: భార్యాభర్తల జీవితం సంతోషంగా ఉండాలి అంటే భర్తతో భార్య కొన్ని విషయాలు పొరపాటున కూడా చెప్పకూడదు. ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు నోరు జారి కూడా కొన్ని మాటలు అనకూడదు.
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే.. కోపంలో మనం మాట్లాడే కొన్ని మాటలు బంధానికి బీటలు తెస్తాయి. చాలా మంది కోపంలో నోరు జారుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాం..? ఎలాంటి మాటలు అంటున్నాం అనే విషయం కూడా ఆలోచించరు. కానీ, అందులోని మాటలు పూర్తిగా దాంపత్య జీవితాన్నే నాశనం చేయగలవు. అందుకే, నోరు జారి కోపంలో, లేదా సరదాగా ఉన్నప్పుడు కూడా కొన్ని మాటలు అనకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి.. భర్తతో భార్య ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం….
24
నువ్వు మగాడివేనా..?
‘ నువ్వు అసలు మగాడివేనా?’ అని ఏ భార్యా.. తన భర్తను అడగకూడదు. మగతనం, పౌరుషం అనేది పురుషుడికి అహంకారానికి సంబంధించిన విషయం. మీరు ఈ మాటను సరదాకి అన్నా కూడా.. ఆ క్షణంలో అతను దాన్ని సరదాగా తీసుకున్నా.. కాల క్రమేణా అది బంధంలో సమస్యలు తెస్తుంది. అందుకే, ఎప్పుడూ భర్త పౌరుషాన్ని ప్రశ్నించకూడదని చాణక్య నీతి చెబుతుంది.
34
నిన్ను కాకుండా అతన్ని పెళ్లి చేసుకుంటే...
‘నిన్ను కాకుండా వేరే వాళ్లను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం చాలా బాగుండేది' అనే మాట. ఈ మాటను సాధారణంగా కోపంలో అంటుంటారు. కానీ ఇది మగవాళ్ల అహాన్ని దెబ్బతీస్తుంది. తనకోసం ఇంత చేస్తున్నా ఇలా అంటోందేంటని భర్త బాధపడతాడు. ఈ మాట భర్త భార్యతో అన్నా ఇలాగే ఉంటుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ ఈ మాటను సరదాకి కూడా అనకూడదని చాణక్య నీతి చెబుతోంది.
ఇక మూడోది, ఇతరులతో పోల్చడం. 'పక్కింటి వాళ్ల ఆయనను చూడు', 'నా స్నేహితురాలి భర్తను చూసి నేర్చుకో'.. 'అతను ఎంత మంచివాడో చూడు.. నువ్వేమో ఇలా ఉన్నావ్' అని పోల్చడం. ఇది పురుషుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పొరపాటున కూడా ఇలాంటి పోలికలు తీసుకురాకూడదని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పారు.