Omelette: చాలామందికి రోజూ ఆమ్లెట్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఆమ్లెట్ వంటి ప్రొటీన్ ఉన్న ఆహారం తింటే మంచిదంటారు. అయితే రోజు నూనె, బటర్ తో చేసిన ఆమ్లెట్ తినకూడదు. అందుకే నూనె లేకుండా ఆమ్లెట్ వేసే పద్దతి ఇక్కడ ఇచ్చాము.
మన శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఆమ్లెట్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆమ్లెట్ వేయడానికి నెయ్యి, నూనె లేదా బటర్ వంటివి వాడతారు. కానీ ఇవేమీ లేకుండా హెల్తీ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. దీనికి మీకు కావాల్సిందల్లా ఒక దోసకాయ. దోసకాయలో నీరు, సిలికా అధికంగా ఉంటాయి. వేడి పెనంపై దోసకాయను రుద్దినప్పుడు, పాన్ ఉపరితలంపై నాన్-స్టిక్ పొరలా ఏర్పడుతుంది. దీంతో ఆమ్లెట్ అంటుకోకుండా వేగుతుంది.
23
ఇలా తయారు చేసుకోండి
ఒక దోసకాయను కడిగి సగానికి కట్ చేయండి. నాన్-స్టిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్‌ను మీడియం మంటపై పెట్టి రెండు నిమిషాలు వేడెక్కనివ్వండి. కట్ చేసిన దోసకాయ ముక్కను తీసుకుని వేడి పెనంపై మొత్తం రుద్దండి. దోసకాయ రసం ఆరిపోయే వరకు కొన్ని సెకన్ల పాటు రుద్దుతూ ఉండండి. ఇప్పుడు మీ పెనం ఆమ్లెట్ వేయడానికి సిద్ధంగా ఉంది.
33
ఇలాంటి పెనాన్నే వాడండి
గుడ్లను పగలగొట్టి తక్కువ మంటపై ఆమ్లెట్ ఉడికించండి. పైన కొన్ని కూరగాయలు చల్లుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మూతపెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. కింద భాగం ఉడికిన తర్వాత, దాన్ని తిప్పి రెండో వైపు కూడా కాల్చండి. వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర చల్లి సర్వ్ చేయండి. నూనె లేకుండా ఆమ్లెట్ వేసేటప్పుడు, పెనం నాణ్యతగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ తాజాగా ఉన్న దోసకాయలనే వాడండి. వాటి నుంచే ఎక్కువ నీరు వస్తుంది. నూనెతో చేసిన ఆమ్లెట్‌లో 150-200 అదనపు క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఈ ఆమ్లెట్ ఆరోగ్యానికి మంచింది.