Wall Stickers: ఇంట్లో పిల్లలుంటే గోడలపై స్టిక్కర్లు అతికిస్తారు. వాటిని తొలగించడం కష్టమైన పనే. పెయింట్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఆ స్టిక్కర్లు, జిడ్డు మరకలుసులభంగా తొలగించడానికి ఇక్కడ కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉన్నాయి.
ఇంట్లో పిల్లలుంటే గోడల మీద స్టిక్కర్లు అతికించడం ప్రతి ఇంట్లో జరిగేది. ఆ స్టిక్కర్లు చూడటానికి బాగున్నా, తీసేటప్పుడు మాత్రం పెద్ద తలనొప్పి. స్టిక్కర్‌ను గట్టిగా లాగితే పెయింట్ ఊడిపోతుంది లేదా జిగురు మరకలు గోడపై ఉండిపోతాయి. గోడ అందం చెడకుండా స్టిక్కర్లను తీయడానికి ఇక్కడ కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి.
25
గోరువెచ్చని సబ్బు నీళ్లు
పేపర్ స్టిక్కర్లను తొలగించడానికి ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని, దానికి కొద్దిగా లిక్విడ్ సోప్ లేదా డిష్‌వాష్ కలపండి. బాగా నురగ వచ్చేలా కలుపుకోండి. ఈ మిశ్రమంలో స్పాంజ్ లేదా బట్టను ముంచి, స్టిక్కర్‌పై 2-3 నిమిషాల పాటు అదిమి ఉంచండి. నీరు జిగురు వరకు చేరి స్టిక్కర్ మెత్తబడ్డాక, తేలికగా తుడిస్తే సులభంగా వచ్చేస్తుంది.
35
కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్
నూనెకు జిగురును తొలగించే లక్షణం ఉంటుంది. దూదిని (Cotton) నూనెలో ముంచి, స్టిక్కర్ అంచులపై, పైన బాగా రాయండి. 5 నిమిషాల తర్వాత నూనె జిగురును మెత్తబరుస్తుంది, అప్పుడు నెమ్మదిగా దాన్ని తీసేయండి. స్టిక్కర్ తీశాక, ఆ ప్రదేశంలో నూనె మరకలు పోవడానికి సబ్బు నీటితో శుభ్రంగా తుడవండి.
వెనిగర్‌లోని యాసిడ్ గుణం పెయింట్‌కు హాని చేయకుండా మొండి జిగురును తొలగించడంలో సహాయపడుతుంది. ఒక బట్ట లేదా టిష్యూ పేపర్‌ను వెనిగర్‌లో ముంచి, స్టిక్కర్‌పై 5 నిమిషాల పాటు ఉంచండి. జిగురు వదులుగా అయ్యాక, స్టిక్కర్‌ను సులభంగా తీసివేయవచ్చు.
55
హెయిర్ డ్రయ్యర్
స్టిక్కర్ వెనుక ఉన్న జిగురును (Glue) కరిగించడానికి వేడి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హెయిర్ డ్రయ్యర్‌ను మీడియం హీట్‌లో సెట్ చేయండి. స్టిక్కర్‌కు 3 నుంచి 4 అంగుళాల దూరంలో ఉంచి, 10-15 సెకన్ల పాటు వేడి గాలిని చూపించండి. జిగురు కరగడం మొదలవగానే, ప్లాస్టిక్ కార్డ్ లేదా వేళ్లతో స్టిక్కర్ మూలను నెమ్మదిగా పైకి లేపండి. తీసేటప్పుడు కూడా కొద్దిగా వేడి గాలి తగిలిస్తే, పెయింట్ ఊడిరాకుండా స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది.