Vastu Tips: ఇంటి గుమ్మం ముందు ఈ వస్తువులు పెడితే.. లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టదు..!

Published : Aug 26, 2026, 06:08 PM IST

Vastu Tips: వాస్తు ప్రకారం తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పులు ఆర్థికంగా సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటి గుమ్మం ముందు కొన్ని వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదు.

PREV
13
Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇంట్లోకి సానుకూల శక్తి , వెలుతురు, ప్రాణవాయువు మాత్రమే కాక లక్ష్మీదేవి ఆగమనం కూడా ప్రధాన ద్వారం ద్వారానే జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా, సుందరంగా ఉండాలి.అయితే, తెలియక గుమ్మం ముందు లేదా తలుపుకు ఎదురుగా కొన్ని వస్తువులను ఉంచడం వల్ల వాస్తు దోషాలు కలగడమే కాకుండా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గుమ్మం వద్ద ఉంచకూడని వస్తువులు పాటించాల్సిన సూచనలు ఇవే:

23
ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడని 8 వస్తువులు:

1. చెత్త బుట్ట : ప్రధాన ద్వారం దగ్గర చెత్త బుట్ట పెట్టడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది. అంతేకాకుండా, చెత్త వల్ల దుర్వాసన, క్రిమికీటకాలు ఇంట్లోకి వ్యాపించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

2. చెల్లాచెదురుగా ఉన్న చెప్పులు: గుమ్మం వద్ద చెప్పులు, షూలు అస్తవ్యస్తంగా పడేయకూడదు. వాటిని క్రమబద్ధంగా ఒక మూలన ఉన్న షూ ర్యాక్‌లో పెట్టుకోవడం శ్రేయస్కరం.

3. తలుపుకు అడ్డంగా భారీ ఫర్నిచర్: ద్వారం తెరిచిన వెంటనే పెద్ద అల్మారాలు లేదా భారీ వస్తువులు ఎదురుగా ఉండకూడదు. ఇవి ఇంట్లోకి వచ్చే శక్తి ప్రవాహాన్ని, రాకపోకలను అడ్డుకుంటాయి.

4. చీపురు , క్లీనింగ్ సామగ్రి: చీపురు, మాప్, ఇతర శుభ్రపరిచే వస్తువులను ప్రధాన ద్వారం వద్ద బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. వీటిని ఎవరికీ కనిపించని ప్రత్యేక స్థలంలో భద్రపరచాలి.

5. వాడిపోయిన,ఎండిపోయిన మొక్కలు: గుమ్మం వద్ద ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించాలి. వాటి స్థానంలో ఎప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉండే మొక్కలను పెంచడం ద్వారా ఇంటికి అందం, శుభం చేకూరుతాయి.

6. తలుపుకు ఎదురుగా అద్దం: గుమ్మం తెరిచేసరికి ఎదురుగా అద్దం కనిపిస్తే, ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి ఆ అద్దంలో ప్రతిబింబించి తిరిగి బయటకు వెళ్ళిపోతుందని వాస్తు విశ్వాసం.

7. నీటి లీకేజీలు: గుమ్మం దగ్గర పైపుల నుంచి నీరు కారడం, నీరు నిలిచిపోవడం వంటివి ఆర్థిక నష్టానికి, అపరిశుభ్రతకు సంకేతం. ఇలాంటి లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించాలి.

8. పాడైన తలుపులు , విరిగిన హ్యాండిల్స్: ప్రధాన ద్వారం తలుపు శబ్దం రావడం, తాళం సరిగా పనిచేయకపోవడం లేదా డోర్ హ్యాండిల్ విరిగి ఉండటం చేయకూడదు.

33
ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి వస్తువులు ఉంచాలి?

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలి:

తగినంత వెలుతురు ఇచ్చే దీపాలు లేదా లైట్లు ఏర్పాటు చేయాలి.

నిత్యం అందమైన ముగ్గులు, తోరణాలు, తాజా పూలతో గుమ్మాన్ని అలంకరించాలి.

పచ్చని మొక్కలను ఉంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories