Motivational story: కష్టం వచ్చిందని కంగారు పడొద్దు.. ఈ పావురంలా తెలివిగా ఆలోచిస్తే బిందాస్‌గా ఉండొచ్చు.

Published : Mar 10, 2025, 06:44 PM IST

కథలు వినడానికి సింపుల్‌గా ఉన్నా జీవితానికి సరిపడ సందేశాన్ని అందిస్తాయి. చిన్నప్పుడు మనం చదువుకున్న కథలు ఇప్పుడు నిజ జీవితాన్ని సాఫీగా సాగేలా చేసేందుకు ఉపయోగపడుతాయి. అలాంటి ఒక మంచి నీతి కథ ఈరోజు తెలుసుకుందాం..   

PREV
13
Motivational story: కష్టం వచ్చిందని కంగారు పడొద్దు.. ఈ పావురంలా తెలివిగా ఆలోచిస్తే బిందాస్‌గా ఉండొచ్చు.

ఒకసారి అడవిలో వేటగాడు ఏర్పాటు చేసిన వలలో పావురం చిక్కుకుపోతుంది. దీంతో ఆ పావురానికి ఎలా బయటకు రావాలో అస్సలు అర్థం కాదు. ఎవరైనా సాయం చేసే వాళ్లు ఉంటారేమో అని అటు, ఇటు చూస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. అయితే అంతలోనే అటుగా ఓ కోతి వస్తుంది. 

23

నిజానికి ఆ కోతి చాలా కోపిష్టి.. ఎవర్రి మాట వినదు. సాయం చేయడం పక్కన పెడితే. ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసే రకం. ఆ కోతిని సాయం అడిగితే చేయదని పావురానికి కూడా తెలుసు. అందుకే తెలివిగా ఆలోచిస్తుంది. కష్టం వచ్చింది కదా అని కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తుంది. 

కోతితో మాట్లాడుతూ.. 'కోతి బావా, కోతి బావా.. ఈ వల చాలా బరువుగా ఉంది. ఇప్పటి వరకు చాలా మంది తీయడానికి ప్రయత్నించారు. నువ్వు కూడా ఈ వలను ఎత్తలేవు. ఎలాగో నీ వల్ల సాధ్యం కాదు కాబట్టి నిన్ను నేను సాయం చేయమని అడగడం లేదు' అని చెబుతుంది. దీంతో కోతికి ఒక్కసారిగా కోపం వస్తుంది. 

33

నాతోనే కాదంటావా.? నా బలం ఏంటో చూపిస్తా అంటుంది. ఈ వలను నేను ఎత్తకపోవడం ఏంటి అంటూ.. ఒక చేత్తో వలను విసిరి పడేస్తుంది. దీంతో పావురం తుర్రుమని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. 

నీతి: ఈ కథలో పావురానికి వచ్చినట్లే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. అయితే కష్టాలకు భయపడి ఢీలా పడుతాం. సమస్య పరిష్కారానికి ఆలోచించకుండా అనవసరంగా కంగారు పడుతుంటాం. నిజానికి ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యల నుంచి బయటపడొచ్చు. 
 

click me!

Recommended Stories