మగవాళ్లు లేని ఈ ఊరిపేరు ఉమోజా. ఇది ఉత్తర కెన్యాలోని సంబురు ప్రాంతంలో ఉంది. అక్కడ ఆడవాళ్లు మాత్రమే ఉంటారు. మగాళ్లకి అస్సలు ప్రవేశం లేదు.
ఈ ఊరిని 1990లో 15 మంది ఆడవాళ్లు కలిసి స్థాపించారు. ఈ ఆడవాళ్లు తమ జీవితాల్లో హింసా, అత్యాచారం, బాల్యవివాహాలకు గురయ్యారు. అందుకే వాళ్లు బాధిత మహిళల కోసం ప్రత్యేకమైన ఊరిని స్థాపించారు.