బరువు తగ్గాలంటే ఎప్పుడు తినాలి?
మీరు బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటే సాయంత్రం 7 గంటలకల్లా రాత్రి భోజనం పూర్తి చేయండి. అప్పుడే బాడీలో జీవక్రియలు బాగా పనిచేస్తాయి. కొవ్వు కూడా పేరుకుపోదు. రాత్రిపూట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకూడదు. రాత్రి తినేటప్పుడు టీవీ, ఫోన్ చూడకూడదు. చూస్తే ఎక్కువ తినేస్తారు. అప్పుడు జీర్ణం సరిగ్గా కాదు. బరువు పెరుగుతారు.
గుర్తుంచుకోండి..
రాత్రి సరైన టైమ్‌కి తింటే హాయిగా నిద్రపోవచ్చు. లేదంటే నిద్ర పాడవుతుంది. అజీర్తి సమస్య కూడా వస్తుంది. తిన్న వెంటనే పడుకోకూడదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు.