వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలనే తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. యవ్వనంగా కనిపించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. అయితే అవేమీ లేకుండానే కేవలం కొన్ని పనులు చేయడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
26
anti ageing foods
మనం తీసుకునే ఆహారం మనల్ని యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తుందట. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, అన్ని రకాల పప్పులు,ప్రోటీన్ ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఆహారం తీసుకోవాలి.
36
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా, అందంగా కనపడటానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాయామాలు ఎక్కువగా చేసే వారు చాలా యాక్టివ్ గానూ యవ్వనంగా కనపడతతారు.
46
వీటితో పాటు చర్మాన్ని అందంగా కనిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. దానికోసం ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉండాలి. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా, తరచూ మాయిశ్చరైజర్ కూడా రాస్తూ ఉండాలి. ఇది కూడా చర్మాన్ని యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తుంది.
56
యవ్వనంగా కనిపించడానికి మనకు సరైన నిద్ర చాలా అవసరం. ఎన్ని పనులు ఉన్నా, ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. సరైన నిద్ర కూడా మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది.
66
lifestyle
ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. దానికోసం ఇద్దరూ ప్రతిరోజూ యోగా, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేయాలి. ఇవి కూడా యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.