అనారోగ్యకరమైన గట్ మొటిమలు, పొడి బారడం వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. మీ చర్మం మీ గట్ ఆరోగ్యం ఎలా ఉందో స్పష్టంగా చెబుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చర్మం మీ గుండె సమస్యల గురించి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కొన్ని సార్లు మీ చర్మం లేదా పెదవులు నీలం రంగులోకి మారొచ్చు. చర్మంపై పసుపు రంగు గడ్డలను కూడా గుర్తించొచ్చు. ఏదో ఒక విధంగానైతే మీ చర్మం మీ గుండె బలహీనంగా ఉందని, గుండెపై మరింత శ్రద్ధ అవసరమని హెచ్చరిస్తుంది. మీ చర్మంపై కనిపించే గుండె సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..