పెసర పప్పును వీళ్లు అసలే తినకూడదు

Published : Jul 19, 2022, 02:52 PM IST

సాధారణంగా చాలా  మంది ఇతర పప్పులకంటే పెసర  పప్పునే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఈ పప్పును కొందరు అస్సలు తినకూడదు.   

PREV
18
పెసర పప్పును వీళ్లు అసలే తినకూడదు

పెసర పప్పు కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. నిజానికి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. దీనిలో మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి2, విటమిన్ బి 6,  విటమిన్ బి9, విటమిన్ బి4, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

28

ఈ పెసరపప్పును సలాడ్లు, పప్పు చారు, సూప్ ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అందులో మొలకలు వచ్చిన పెసరపప్పును తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. అధిక శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి. 

38

పెసర పప్పులో ఉండే ఐసోవిటాక్సిన్, విటాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో అధికంగా పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. 

48

రక్తపోటును నియంత్రించేందుకు దీనిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు ఎంతో సహాయపడతాయి. ఈ పప్పు తినడం వల్ల అంత తొందరగా ఆకలి వేయదు. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న పప్పును కొందరు అసలే తినకూడదు. తింటేఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ పెసర పప్పును ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం.. 
 

58

రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు

రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు పెసర పప్పును తినకూడదు. ఎందుకంటే పెసర పప్పుల్లో రక్తంలో చక్కెర లెవెల్స్ ను తగ్గించే గుణాలుంటాయి. అందుకే రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువతో బాధపడేవారు దీన్ని తినకపోవడమే మంచిది.
 

68

తక్కువ రక్తపోటు

పెసర పప్పు అధిక రక్తపోటును నియంత్రిండానికి సహాయపడుతుంది. అందుకే బీపీ తక్కువగా ఉంటే ఈ పప్పును తీసుకోవడం మానేయండి. ఇది బీపీని మరింత తగ్గిస్తుంది.  
 

78

Uric Acid

అధిక యూరిక్ ఆమ్లం

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే కూడా ఈ పెసర పప్పును తినకూడదు. ఎందుకంటే దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ ను మరింత పెంచుతుంది. 

88

మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు పెసర పప్పును మొత్తమే తినకూడదు. దీన్ని తింటే కిడ్నీల్లో రాళ్లు మరింత పెద్దవిగా మారుతాయి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్, ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories