మంకీపాక్స్ ప్రమాదం వీరికే ఎక్కువగా ఉంటుంది..

Published : Jul 16, 2022, 09:54 AM IST

Monkeypox: ప్రపంచ దేశాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇండియాలోకి కూడా ప్రవేశించింది. దీని తొలికేసు కేరళలో నమోదైంది. 

PREV
110
మంకీపాక్స్ ప్రమాదం వీరికే ఎక్కువగా ఉంటుంది..
monkeypox

ఒక వైపు కరోనా , మరో వైపు మంకీపాక్స్.. ఈ రెండూ ప్రపంచ దేశాల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాస్త తగ్గిందనుకున్న కరోనా కేసులు కొద్ది రోజుల నుంచి దారుణంగా నమోదవుతున్నాయి. దీనికి తోడు మంకీపాక్స్ కేసులు చాలా దేశాల్లో పెద్దమొత్తంలో నమోదవుతున్నాయి. ఇక తాజాగా ఇండియాలో కూడా తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి తిరిగొచ్చిన కేరళకు చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటీవ్ వచ్చింది. 

210

కేరళ ఆరోగ్య శాఖ మంతి వీణా జార్జ్ ఏఎణ్ఐతో మాట్లాడుతూ.. రోగి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోగితో సన్నిహితంగా ఉన్న అందరినీ గుర్తించామని ఆమె తెలియజేశారు. 

310

మంకీపాక్స్ అంటే ఏమిటీ?

ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు, కోతులను నుంచి ఎక్కువగా వస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ.. ఈ మంకీపాక్స్ లక్షణాలు వాటంతట అవే కొన్ని వారాల్లోనే పోతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడిస్తోంది. 

410
monkeypox virus

కాగా మంకీపాక్స్ సోకిన వారిలో 1 నుంచి 10 శాతం మంది వరకు చనిపోయారని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే దీనివల్ల కలిగే కంటి సమస్యలు, చర్మ సంక్రామ్యత, గందరగోళం వంటి తీవ్రమైన లక్షణాల గురించి గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. 

510

మంకీపాక్స్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంది

మంకీపాక్స్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినా (లైంగిక సంపర్కంతో సహా) ఇది ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. అలాగే పెంపుడు జంతువులు, ఎలుకలు వంటి వాటివల్ల కూడా సోకే అవకాశం ఉంది. ఇలాంటి వాటితో సన్నిహితంగా మెలిగినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

610

మంకీపాక్స్ సోకిన వ్యక్తులతో, జంతువులతో సన్నిహితంగా ఉండటం వల్ల మంకీపాక్స్ మనుషులకు వ్యాపిస్తుంది. ఇందులో చర్మం ద్వారా, నోటి ద్వారా, ముఖాముఖి, లైంగిక సంపర్కం ద్వారా ఇది వ్యాపిస్తుంది. మంకీపాక్స్ రోగుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

710

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. నవజాత శిశువులు, చిన్న పిల్లలు,  అంతర్లీన రోగనిరోధక లోపాలున్న వారికి మంకీపాక్స్ లక్షణాలు అందరికంటే ముందుగా సోకే ప్రమాదం ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో  మంకీపాక్స్ ద్వారా ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. 

810
monkeypox virus

మశూచీ వ్యాక్సిన్ కొంత వరకు రక్షణగా ఉంచుతుంది.. 

పలు అధ్యయనాల ప్రకారం.. మశూచి వ్యాక్సిన్ మంకీపాక్స్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడైంది. మంకీపాక్స్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంకీపాక్స్ లక్షణాలు తగ్గడంతో పాటుగా.. భవిష్యత్తులో అంటువ్యాధులు సోకే ప్రమాదం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

910

మంకీపాక్స్ సంకేతాలు

సాధారణంగా మంకీపాక్స్ లక్షణాలు 6 నుంచి 13 రోజుల్లో కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించడానికి మూడు వారాల టైం కూడా పొట్టొచ్చట. ఈ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాల వరకు ఉంటాయి. 

 

1010

అయితే మంకీపాక్స్ మొదటి లక్షణాలు 5 నుంచి 21 రోజుల మధ్యకాలంలో కనిపించే అవకాశం ఉందని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ నివేదించింది. 

మంకీపాక్స్ కొన్ని లక్షణాలు

తలనొప్పి

అధిక ఉష్ణోగ్రత

కండరాల నొప్పులు

అలసట

వెన్ను నొప్పి
 
చలి
 
 

Read more Photos on
click me!

Recommended Stories