మైదా .. మైదా కూడా రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువ చేస్తుంది. అంతేకాదు ఇది రసాయన ప్రతిచర్యకు (Chemical reaction)దారితీస్తుంది. ఈ కారణంగా బ్లడ్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ పిండిని ఎక్కువగా ఉపయోగించకండి. సెప్సిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. జ్వరం, జలుబు, వేగంగా శ్వాస తీసుకోవడం, వేగంగా గుండె కొట్టుకోవడం, మైకము, గందరగోళం, వాంతులు , వికారం వంటివి దీని లక్షణాలు. ఇవన్నీ మీకు కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.