Date with Colleague: ఆఫీస్ కొలిగ్ తో డేటింగ్ లో ఉన్నారా? అయితే ఈ విషయాల్లో కేర్ ఫుల్ గాఉండండి..లేదంటేనా?

First Published | Jun 6, 2022, 10:54 AM IST

Date with Colleague: ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది మరుపురాని అనుభూతి. కానీ ఆఫీసుల్లో ఇద్దరి వ్యక్తుల మధ్యన ప్రేమ పుట్టినట్టైతే ఆ ఇద్దరి గురించి ఎన్నో గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆఫీసు కొలిగ్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. లేదంటీ మీ జాబ్ కూడా పోవచ్చు. 
 

ఆఫీసు లేదా కాలేజీ.. ఆడ మగ కలిసి మాట్లాడుకుంటే చాలు.. వారిద్ధరి మధ్యన ఏం లేకున్నా.. ఏదో ఉంది అంటూ భావించేవారు చాలానే ఉన్నారు. ఒకవేళ వారిద్దరి మధ్యన సమ్ థింగ్.. సమ్ థింగ్.. (love)ఉంటే ఇంకా ఏమన్నానా.. ఆఫీసంతా వారి గురించే గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు.
 

ఇంతకీ ఆఫీసులో మీ కొలిగ్ తో డేట్ చేయడం ఎంత వరకు మంచిది? అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. దీనికి కొందరు పాజిటీవ్ గానే భావిస్తే మరికొంతమంది మాత్రం తప్పుగా భావిస్తారు. 


ఒకవేళ మీరు ఆఫీసులో మీ కొలిగ్ తో డేటింగ్ (Dating) లో ఉన్నట్టైతే.. చాలా జాగ్రత్తగా (careful) ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే అది మీ కెరీర్ (Career) కు అస్సలు మంచిది కాదు. ఒక్కోసారి మీ జాబ్ ను కూడా కోల్పోవచ్చు. కాబట్టి ఆఫీసులో కొలిగ్ తో డేటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆఫీసులో ప్రొఫెషనల్.. ఆఫీస్ బయట ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపినప్పటికీ.. మీరు ఆఫీసు లోపల మాత్రం ప్రొఫెషనల్ గానే ఉండాలి. మీ ఇద్దరి మధ్యన జరిగిన విషయాలను పని (Work) మధ్యలోకి అస్సలు తీసుకురాకూడదు. ఎందుకంటే మీ విషయాలు ఆఫీస్ పనిని ప్రభావితం చేస్తాయి. సరిగ్గా పనిచేయలేరు. ఇది ఆఫీసులో మీ ఇమేజ్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

గొడవలను ఎవరికీ చెప్పుకోకూడదు.. ఏ సంబంధం (Relationship) లో నైనా ప్రేమతో పాటుగా..వేభేదాలు కూడా ఉంటాయి. ప్రేమ ఉన్నచోట, కొట్లాటలు, మనస్పర్థలు రావడం చాలా సహజం కూడా. మీ కొలిగ్ తో మీరు డేటింగ్ లో ఉన్నప్పుడు.. మీ ఇద్దరి మధ్యన వచ్చిన విభేదాలను, కొట్లాటలను ఇతరులతో అస్సలు చెప్పుకోకండి. ముఖ్యంగా ఆఫీసులో. మీ ఇద్దరి మధ్యన జరిగిన విషయాలను ఇతర ఉద్యోగులతో పంచుకుంటే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే  మీ సొంత విషయాలను వీలైనంత వరకు ఆఫీసుకు మోసుకురాకండి. 
 

మీ రిలేషన్ షిప్ ను ఇతరులతో చెప్పకండి.. సాధారణంగా ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు వారి విషయాలను స్నేహితులు (Friends) తో, సహోద్యోగులు (Colleagues) తో చెప్పుకుంటూ ఉంటారు. ఇది మంచి విషయమే అయినా.. మీ ఆఫీసులో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డట్టైతే ఆ విషయాన్ని, డేటింగ్ విషయాలను వీలైనంత వరకు ఆఫీసుల్లో ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది. మీ గురించి, మీ భాగస్వామి వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పే అలవాటును మానుకోండి. ఇవి మీ పై ప్రతికూల ప్రభావాన్నిచూపిస్తాయి. అందుకే సీక్రేట్స్ మెయిన్ టైన్ చేయండి. 

మెసేజ్ చేయడం మర్చిపోకూడదు.. ఇప్పుడిప్పుడే మీరు డేటింగ్ లో ఉన్నట్టైతే.. మీ ఆఫీస్ సమయాల్లో కూడా మీ పార్టనర్ గురించి ఆలోచించడం మర్చిపోకూడదు. ఒక చిన్న మెసేజ్ పంపినా.. ఆఫీసులో ఉండే ఒత్తిడంతా పోయి.. సంతోషం కలుగుతుంది. దీనికోసం మీరు ఆఫీస్ మెయిల్ ను మాత్రం వాడుకోకండి. ఇవి మీకు చిక్కులు తెచ్చే అవకాశం ఉంది.  

Latest Videos

click me!