ఈ సూపర్ ఫుడ్స్ ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి..

First Published Aug 14, 2022, 4:00 PM IST

పోషక విలువలు ఎక్కువగా ఉండే  ఆహారాలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. దీంతో ఎలాంటి రోగమైనా మీకంటుకునే అవకాశమే ఉండదు.
 

వానాకాలం చల్లని చిరుజల్లులను, చల్లని గాలులను మోసుకురావడంతో పాటుగా ఎన్నో రకాల రోగాలను కూడా తీసుకొస్తుంది. ఇక ఈ సీజన్ లో దగ్గు, జబులు, మొటిమలు, అలెర్జీలు, చర్మ వ్యాధులతో పాటుగా అంటువ్యాధులు ఖచ్చితంగా వస్తాయి. ఈ సమస్యలు మనకు సోకకూడదంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. అయితే కొన్ని ఆహారాలను రోజూ తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అవేంటంటే.. 
 

సత్తు

బియ్యం పిండి, గోధుమలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగల మిశ్రమమే సత్తు. ఈ పిండిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, కాల్షియం, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి, తిమ్మరి, కళ్ల కింద నల్లని వాలయాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా ఆపుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

దేశీ మొక్కజొన్న

వర్షం పడుతుంటే వేడి వేడిగా మొక్కజొన్న ను తింటుంటే వచ్చే ఆ మజాయే వేరబ్బా.. మీకు తెలుసా.. రుచి కోసం తినే ఈ మొక్క జొన్న మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్ , విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జుట్టు తెల్లబడటాన్ని ఆపుతాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని తగ్గించడమే కాదు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను కూడా నియంత్రిస్తాయి. 
 

ఆలుగడ్డ

బంగాళాదుంపల్లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీన్ని తినడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తొందరగా రావు. అంతేకాదు జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది. 
 

ఖర్జూరాలు

ఖర్జూరాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగుపడుతాయి. అలాగే నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. అలెర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. వ్యాయామానికి ముందు వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు వ్యాయామం చేయగలుగుతారు. 

రాగులు

రాగుల్లో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాగులను తీసుకోవడం వల్ల వెన్నెముక బలపడుతుంది. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. 
 

జాక్ ఫ్రూట్ విత్తనాలు

జాక్ ఫ్రూట్ విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది. అందుకే ఇది సూపర్ ఫుడ్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ విత్తనాలను తరచుగా తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే వంధ్యత్వ సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇవి వృద్ధాప్య లక్షణాలను పోగొట్టి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. 

click me!