పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహారాలు..

First Published Jan 29, 2023, 3:05 PM IST

పాలిచ్చే తల్లులు ఎప్పుడూ కూడా పోషకాహారాన్నే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తల్లి సరైన ఆహారాన్ని తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు ఎప్పుడూ ఆకలితో ఉంటారు. పిల్లల మెదడు ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. పాలిచ్చే తల్లులు తినాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


చియా విత్తనాలు

చియా విత్తనాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఈ గిజంలు రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి గుండెను  ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. చియా విత్తనాల్లో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది నవజాత శిశువుల మెదడు అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. అందుకే పాలిచ్చే తల్లులు వీటిని తప్పకుండా తీసుకోవాలి.
 

leafy vegetables

ఆకుకూరలు 

ఏ కూరగాయలను తిన్నా.. తినకున్నా ఆకు కూరలను తప్పకుండా తినాలి. ఎందుకంటే ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ ఎ,  విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లకు ఆకు కూరలు మంచి మూలం. ఆకుకూరల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తింటే బరువు పెరిగిపోతామన్న భయం ఉండదు. ఈ పోషకాలు పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి. 
 

ఖర్జూరాలు

పాలిచ్చే తల్లులకు కూడా ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. నిజానికి తల్లుల్లో పాల ఉత్పత్తికి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ చాలా అవసరం. అయితే నేరేడు పండ్లు, ఖర్జూరాలు తినడం వల్ల ఈ ప్రోలాక్టిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. వీటిలోడైటరీ ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం లు కూడా ఉంటాయి. 
 

చేపలు

చేపలు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి 12 కూడా అధికంగా ఉంటాయి. చేపల్లో విటమిన్ డి కూడా ఉంటుంది. చేపలను తినడం వల్ల తల్లుల్లు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 

చిలగడదుంప

పాలిచ్చే తల్లులకు రోజూ ఒక మీడియం సైజు తీపి బంగాళాదుంపను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ మెరుగైన కంటి చూపు, ఎముకల పెరుగుదల, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్, కోలిన్, లుటిన్, విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ కె , రిబోఫ్లేవిన్, అయోడిన్, ఫోలేట్ , సెలీనియం పుష్కలంగా ఉంటాయి. సాయంత్రం భోజనం లేదా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తీసుకోవడం శరీరానికి చాలా మంచిది.

click me!