రక్తపోటును తగ్గించడం నుంచి కొవ్వును కరిగించడం వరకు.. చలికాలంలో పచ్చి బఠానీల వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

First Published Jan 29, 2023, 12:58 PM IST

పచ్చి బఠానీల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీటిలో విటమిన్ ఎ, విటమిన్ కె, ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 
 

green peas

పచ్చి బఠాణీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. కానీ వీటిని చాలా తక్కువ మందే తింటుంటారు. కానీ పచ్చి బఠానీలు ప్రతి ఒక్కరూ తినగలిగే సూపర్ ఫుడ్. ఇతర కాలాలతో పోల్చితే పచ్చి బఠానీలు చలికాలంలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాదు పచ్చి బఠానీలు ఫైబర్, పొటాషియం, జింక్ కు మంచి మూలం కూడా. పచ్చి బఠానీలు ఫుడ్ రుచిని పెంచమే కాకుండా.. మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది కూడా. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో పచ్చి బఠానీలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

పచ్చి బఠానీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ను కలిగి ఉంటాయి. ఇది మీరు ఆహారం తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర ఎంత త్వరగా పెరుగుతుందో చెప్పే కొలత. ఇకపోతే పచ్చి బఠానీలలో ఫైబర్  కంటెంట్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి  ఎంతో సహాయపడతాయి. 
 

హెల్తీ స్కిన్

పచ్చి బఠాణీలలో విటమిన్ బి 6, విటమిన్ సి, ఫోలేట్ (ఫోలిక్ యాసిడ్) వంటి పోషకాలు చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పోషకాలు మంట, ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.  ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ బఠానీల్లో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. 

ప్రోటీన్ కు అద్భుతమైన మూలం

పచ్చి బఠానీలు ప్రోటీన్ కు ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో ఒకటి. పచ్చి బఠానీల్లో ఎక్కవ మొత్తంలో ఫైబర్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే జంతు ఆధారిత ప్రోటీన్ తీసుకోనివారిలో ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి పచ్చి బఠానీలు మంచి ఆహార ఎంపిక.

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది

పచ్చి బఠానీలలో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ (చాలా తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీని ఫలితంగా మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. 
 

click me!