టీ, కాఫీ: కొంతమంది టీ లేదా కాఫీని ఏదైనా ఆహారం తీసుకోకముందే తాగుతుంటారు. కానీ మరికొంత మంది ఆహారం తీసుకున్న తర్వాతే టీ, కాఫీని తాగుతుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. తిన్న తర్వాత టీ తాగితే .. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల బారిన పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లేదా కాఫీ తాగిన గంట తర్వాత లేదా గంట ముందు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే టీ లో ఉండే టానిన్ అనే రసాయనం ఐరన్ absorption process కు అడ్డుగా నిలుస్తుంది. దీని వల్ల తీవ్రమైన తలనొప్పి, రక్తహీనత, కాళ్లు చేతుల నొప్పులు వస్తాయి. అంతేకాదు ఇది మన ఆకలి మందగించేలా చేస్తుంది.