ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే దీన్ని సీజన్లతో సంబంధం లేకుండా తినొచ్చంటారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయలో విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి6, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. అలాగే ఇది జుట్టు సమస్యలను కూడా పోగొడుతుంది. తెల్లజుట్టును నల్లగా చేయడం, హెయిర్ ఫాల్ ను ఆపడం, చుండ్రును పోగొట్టడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి వాంతులు, విరేచనాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటితో పాటుగా ఉసిరి మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఉసిరికాయను కొంతమంది అసలే తినకూడదు. ఎవరెవరు తినకూడదు..? ఎందుకు తినకూడదో తెలుసుకుందాం పదండి.