ఆడవారిలో కామన్ గా ఉండే పోషక లోపాలు ఇవే.. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు..

Published : Oct 13, 2022, 10:58 AM IST

మగవారితో పోల్చితే ఆడవారికే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. కారణం వీరి శరీరంలో ముఖ్యమైన పోషకాలు లోపించడమే. అందుకే ఇవి లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.   

PREV
17
 ఆడవారిలో కామన్ గా ఉండే పోషక లోపాలు ఇవే.. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు..

మహిళలకు వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు పోషకాల లోపమే ముఖ్య కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆడవారు ఫుడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా కొన్ని కొన్ని సార్లు పోషకాలను అందించలేదు. వీటివల్లే ఎక్కడ లేని రోగాలు చుట్టుకుంటాయి. 

ఎముకల నొప్పి, అలసట, వేళ్ల జలదరింపు, మగత, కండరాల బలహీనత వంటివి పోషకాల లోపం లక్షణాలు.  వీటి వల్ల ఏమవుతుందిలే అని అలాగే వదిలేస్తే సమస్య మరింత పెద్దది అయ్యి దీర్థకాలిక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే  ఆడవాళ్లు తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే పోషకాల లోపం ఏంటి..? వాటికి ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 

27

ఇనుము లోపం

మగవారితో పోల్చితే ఆడవారిలోనే ఇనుము లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవారిలో ప్రతి నెల రక్తస్రావం, రుతుస్రావం కారణంగా రక్తం లోపిస్తుంది. దీన్ని భర్తీ చేయకపోతే రక్తహీనత సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. రక్తహీనత అంటే మన శరీరంలో రక్తం తగ్గడం అని అర్థం. ఎర్ర రక్త కణాలే శరీర కణజాలాలకు ఆక్సిజన్ను తీసుకెళతాయి. ఇకపోతే రక్తహీనత శరీరంలో ఇనుము స్థాయిలు తక్కువగా ఉండేందుకు కారణమవుతుంది. దీనివల్ల విపరీతమైన అలసట, నాలుక నొప్పి, మైకము, శ్వాస ఆడకపోవడం, గోర్లు పెళుసులుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

శరీరంలో ఇనుము స్థాయిలు పెరగాలంటే ఆడవారు  బీన్స్, సీ ఫుడ్, బఠాణీలు, ముదురు ఆకుకూరలు, ఎర్రమాంసం,  తృణధాన్యాలు,ఎండుద్రాక్ష, ఆఫ్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్ ను తినాలి. 
 

37
calcium deficiency

కాల్షియం లోపం

మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజం కాల్షియం. ఇదే ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా నిర్మించడానికి సహాయపడుతుంది. ఒక వేళ ఇది లోపిస్తే బోలు ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పలు నివేదికల ప్రకారం.. 8 నుంచి 19 ఏండ్ల మధ్యనున్న బాలికలు, 50 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న ఆడవారి శరీరంలో కాల్షియం స్థాయిలు తక్కువగా ఉన్నాయట. దీనివల్ల వీరిలో దంతాల సమస్యలు, ఎముకలు బలహీనంగా ఉండటం, హృదయ స్పందన సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

పాలు, పెరుగు, జున్ను, ఆకు కూరలు, సాల్మాన్, తృణధాన్యాలు వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. 
 

47

ఫోలేట్ లోపం

విటమిన్ బి9 నే ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఫోలేట్ ఎర్ర రక్త కణాలను ఏర్పరచడానికి సహాయపడే అతి ముఖ్యమైన పోషకం. ఇది ఆరోగ్యకరమైన కణాల పెరగుదలకు, పనితీరును మెరుగుపర్చేందుకు సహాయపడుతుంది. గర్భిణులకు ఈ ఫోషకం చాలా అవసరం. ఇదే పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తతుంది. 

ఫోలేట్ లోపం వల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. శ్వాస ఆడకపోవడం, మైకము, పాలిపోయిన చర్మం, బద్దకం, గుండె దడ వంటి సమస్యలు వస్తాయి. 

ముదురు ఆకు కూరలు, ఫీఫుడ్, కాయలు, పండ్లు, బీన్స్, విత్తనాలు, తృణధాన్యాలు వంటి ఆహారాల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. 
 

57


అయోడిన్ లోపం

థైరాయిడ్ పనితీరు బాగుండటానికి, థైరాయిడ్ హార్మోన్లు  ఉత్పత్తి అవడానికి మన శరీరానికి కావాల్సిన  మరొక ముఖ్యమైన ఖనిజం అయోడిన్. ఇది జీవక్రియను నిర్వహించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరక విధులను కూడా ఇది తనిఖీ చేస్తుంది. 

శరీరంలో అయోడిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథి క్రమరహితంగా పెరుగుతుంది. దీనినే గోయిటర్ అని కూడా అంటారు. దీనివల్ల బలహీనంగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, అలసట, చలిగా అనిపించడంతో పాటుగా బరువు కూడా పెరుగుతారు. 

గుడ్లు, సీఫుడ్, పాడి, సెల్ఫిష్, ఉప్పు, చికెన్ వంటి ఆహారాల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. 
 

67


విటమిన్ డి

శరీరం ఆరోగ్యంగా పనిచేయడానినకి విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ డిని సూర్య రశ్మి లేదా మనం తినే ఆహారాలు, సప్లిమెంట్ల ద్వారా పొందొచ్చు. 

విటమిన్ డి లోపించడం వల్ల వెన్ను నొప్పి, గాయాలు త్వరగా మానకపోవడం, అలసట, నిరాశ వంటి లక్షణాలతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

విటమిన్ డి సూర్య రశ్మిద్వారానే కాదు కొవ్వు చేపలు, గుడ్డులోని పచ్చసొన, చేప కాలెయ నూనెలు, పుట్టగొడుగులు, క్యాన్డ్ ట్యూనా, సార్డినెస్, సాల్మాన్ వంటి ఆహారాల నుంచి కూడా అందుతుంది. 

77
vitamin b12

విటమిన్ బి12

మన శరీరానికి అత్యవసరమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. దీనిని మన శరీరం సహజంగా ఉత్పత్తి చేయలేదు. మనం తినే ఆహారాల ద్వారే దీన్ని పొందాల్సి ఉంటుంది. ఈ విటమిన్ మెదడు, నాడీ కణాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అలాగే డీఎన్ఎ ఉత్పత్తిని కూడా సులభతరం చేస్తుంుది. 

యుకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం.. చర్మం లేత పసుపు రంగులో కనిపించడం, నిరాశ, చిరాకు, నడిచే విధానంలో మార్పులు, నోటి పూత, గొంతు, ఎరుపు రంగు నాలుక, కంటి చూపు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలకు బిటమిన్ బి12 యే కారణం. 

పాలు, పెరుగు, గుడ్లు, ఎర్రమాంసం, కొవ్వు చేపలు, తృణధాన్యాల్లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories