మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లే మిమ్మల్ని సంక్రమణ నుంచి రక్షిస్తాయి..

Published : Dec 22, 2022, 04:58 PM IST

చైనాలో కోవిడ్ -19 కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ కరోనా నుంచి సురక్షితంగా ఉండటానికి, వ్యాధి బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తప్పక పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. 

PREV
16
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లే మిమ్మల్ని సంక్రమణ నుంచి రక్షిస్తాయి..
covid 19

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. దీని దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్లు, యువకులు, గర్భిణులు అంటూ తేడా లేకుండా ఎంతో మంది అర్థాంతరంగా చనిపోయారు. మూడేండ్ల తర్వాత  ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలోనే చైనాలో ఇప్పుడు మళ్లీ ప్రమాద ఘంటికలు మోగించింది. బ్రెజిల్, అమెరికా, జపాన్ వంటి దేశాలతో పాలుగా భారత దేశం కూడా అప్రమత్తమైంది. 

26

కరోనా భారిన పడి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది చనిపోయారు. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే వారికి కఠిన ఆంక్షలు విధించారు. వీళ్లు ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు జారీ చేశాయి. అంతే కాదు మాస్కులు ధరించకుండా బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. అయితే కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36

సరైన పరిశుభ్రత పాటించాలి

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఇప్పటికి పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది. ఈ వ్యాధి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మనకు సోకడం ఖాయం. అందుకే సరైన పరిశుభ్రత పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ సోకకుండా ఉండేందుకు సబ్బు నీటితో చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా హ్యాండ్ రబ్ లను వాడాలి. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు నోటికి కర్చీఫ్ ను అడ్డం పెట్టుకోవాలి. ఒకసారి వాడిన వాటిని డస్ట్ బిన్ లో వేయండి. డోర్ హ్యాండిల్స్, కుళాయిలు, ఫోన్ స్క్రీన్ వంటి వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. క్రిమిసంహారకం చేయండి. ఎందుకంటే ఈ ఉపరితలాలకు వైరస్ లు అంటుకునే ప్రమాదం ఉంది. 
 

46
MASK

మాస్క్ ను సరిగ్గా ధరించండి

బయటకు వెళ్లేటప్పుడు మీరు ఖచ్చితంగా మాస్క్ ను యూజ్ చేయాలి. ముఖ్యంగా నోరు, ముక్కు, గడ్డాన్ని పూర్తిగా కప్పి ఉంచే మాస్క్ నే వాడాలి. అయితే మీరు మాస్క్ ను పెట్టుకోవడానికి ముందు మీ చేతులను ముందుగా క్లీన్ చేసుకోండి. అలాగే మాస్క్ ను తీసేసిన తర్వాత కూడా చేతులను మళ్లీ కడగాలి. ఒకేసారి యూజ్ చేసే మాస్క్ లను ఒకేసారి వాడాలి. మళ్లీ మళ్లీ వాడకూడదు. క్లాత్ మాస్క్ ను వాడటం అంత సేఫ్ కాదు. ఒకవేళ వాడినా వాటిని తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. 
 

56

మీ పరిసరాలను సురక్షితంగా ఉంచుకోండి

జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే సన్నిహిత సంబంధాల వల్లే ఇది తొందరగా సోకుతుంది. అందుకే ఇలాంటివి పెట్టుకోకూడదనిన WHO సలహానిచ్చింది. ఇంటి లోపల ఉన్నప్పుడు.. వెంటిలేషన్ కోసం కిటికీని తెరవండి. ఎవరైనా మిమ్మల్ని ఆరుబయట కలిస్తే.. తప్పకుండా మాస్క్ ను ధరించండి. 
 

66

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. వారు కోవిడ్ -19 బారిన పడకుండా తమను, ఇతరులను సురక్షితంగా ఉంచడానికి సరైన మార్గదర్శకాలను పాటించాలి.

జ్వరం లేదా దగ్గు ఉంటే వైద్య సహాయం తీసుకోండి..

మీరు టీకాలు వేయించుకున్నారని లేదా బూస్టర్ డోస్ ను తీసుకున్నారని నిర్ధారించుకోండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువైతే ఆరోగ్య నిపుణుల సలహాను తప్పకుండా తీసుకోండి.

జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడంతో సహా కోవిడ్ -19 సాధారణ లక్షణాల గురించి తెలుసుకోండి. తలనొప్పి, గొంతు నొప్పి, ఎరుపు లేదా కళ్లలో చిరాకు, విరేచనాలు, చర్మం పై దద్దుర్లు లేదా రంగు పాలిపోవడం కోవిడ్ ఇతర సాధారణ లక్షణాలు. 

Read more Photos on
click me!

Recommended Stories