ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి
ఫైబర్ మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఫైబర్ పేగు కదలికలను కూడా నియంత్రిస్తుంది. దీంతో పైల్స్ సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి. పైల్స్ వల్ల పేగు కదలికలు జరిగి రక్తస్రావం జరుగుతుంది. ఫైబర్ కంటెంట్ వల్ల మృదువైన ప్రేగు కదలికకు సహాయపడుతుంది. ఇది పైల్స్ నొప్పిని, అసౌకర్యాన్ని, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.
పీచుపదార్థాలు, పండ్లు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పైల్స్ ఉన్నవాళ్లు నీటిని పుష్కలంగా తాగాల్సి ఉంటుంది.