Bad Foods: మీరు తినే ఇలాంటి ఆహారాలు డయాబెటిస్, గుండె జబ్బులకు కారణం అవుతాయి

Published : Sep 10, 2025, 06:13 PM IST

రోజూ మనం తినే కొన్ని ఆహారాలు మీకు తెలియకుండానే డయాబెటిస్, గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తినడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో వైద్యులు వివరిస్తున్నారు. 

PREV
16
ఈ వ్యాధులే వచ్చే అవకాశం

పోషకాలు నిండిన భోజనం తినడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కానీ కొన్ని రకాల స్నాక్స్ తింటే మాత్రం  భవిష్యత్తులో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.   టీతో బజ్జి తినడం చట్నీతో సమోసాలు, జిలేబీలు తినడం వంటివి మంచిది కాదు. ఇవి హానికరం కాదని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఇష్టంగా తినే ఈ ఆహారాలు డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ లాంటి ప్రమాదాలకు దారితీస్తాయి.

26
సమోసా

సమోసా రుచికరంగా ఉంటుంది. అందుకే ఎంతోమంది దీన్ని తినేందుకు ఇష్టపడతారు. కానీ నూనెలో వేయించిన ఈ వంటకం తినడం గుండెకు హానికరం. పిండి, అనారోగ్యకర కొవ్వులతో నిండిన సమోసాలు ఊబకాయం, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులకు దారితీస్తాయి.

36
జిలేబి

నూనెలో వేయించిన జిలేమిని పంచదార పాకంలో ముంచుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నోరూరించేలా ఉంటుంది. వీటిలో అధిక చక్కెర, కొవ్వులు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతాయి. దీన్ని ఎక్కువగా తినడం కొవ్వు పిత్తాశయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

46
అప్పడాలు

భారతీయుల భోజనంలో అప్పడాలు కచ్చితంగా ఉంటాయి. సాంబారుతో పాటూ వీటిని తింటే ఆ రుచే వేరు. కానీ ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. సోడియం ఎక్కువగా ఉండే నూనెలో వేయించిన అప్పడాలు రక్తపోటును పెంచుతాయి. ఇవి గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

56
బజ్జి

సాయంత్రం సమయంలో టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా టీ తాగేటప్పుడు బజ్జీలు, కారప్పూసలు వంటివి తినేవారు ఎంతో మంది. తింటున్నప్పుడు  టేస్టీగానే ఉంటుంది… కానీ ఇందులో నూనె, పిండి, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తరచుగా తినడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ అసమతుల్యత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

66
కిళ్లీ

భోజనం తరువాత ఎంతో మందికి  కిళ్లీ తినడం అలవాటు. కానీ అది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. కిళ్లీలో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఇది నోటి క్యాన్సర్, చిగుళ్ల వ్యాధులకు దారితీస్తుంది. దీన్ని తరచుగా తినడం వల్ల జీర్ణక్రియ, మెటబాలిజం సమస్యలు వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories