వీటిని తింటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి..

Published : Jul 08, 2022, 02:05 PM IST

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనికోసం నిమ్మకాయలు, నారిం, బొప్పాయి, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, బ్రోకలి వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. 

PREV
18
వీటిని తింటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి..

ఎర్ర రక్తకణాల్లో ఇనుమును కలిగున్న ప్రోటీన్ యే హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ (Hemoglobin)శరీర కణాలకు, రక్తంలోని వివిధ అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మన శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండాలని నిపుణులు చెబుతుంటారు. 

28

శరీరం సక్రమంగా పనిచేయడానికి వయోజనులైన పురుషుల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు 14 నుంచి 18 g/dl, ఆడవారిలో 12 నుంచి   16 g/dlఉండాలి. ఇంతకంటే తక్కువగా ఉన్నట్టైతే అలసట, మైకము, బలహీనత, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

38

2011 లో యునిసెఫ్ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఇండియాలో 56 శాతం మంది బాలికలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారట.  ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి వంటివి హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48

National Anemia Action Council ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడానికి, రక్తం లోపించడానికి ఇనుము లోపం కూడా ఒక కారణం. అయితే డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయలు, గుమ్మడి గింజలు, దానిమ్మ పండు, పుచ్చకాయ, యాపిల్స్ , ఖర్జూర పండ్లతో పాటుగా బీట్ రూట్, బచ్చలి కూర వంటి ఆహారాలు కూడా ఇనుము లోపాన్ని పోగొట్టి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. 

58

హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండే వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నిమ్మకాయలు. స్ట్రాబెర్రీలు, నారింజ, టమోటాలు, బ్రోకలి, ద్రాక్ష వంటి ఆహారాలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. 

68

దానిమ్మలు రక్తహీనత సమస్యను తగ్గించడంతో పాటుగా హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఈ పండులో ఫైబర్, ఐరన్, కాల్షియం, పిండి పదార్థం, విటమిన్ సి  పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఈ పండును రెగ్యులర్ గా తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

78

ఆకు కూరలు, బ్రోకలి, అరటి పండ్లు, బీట్ రూట్ వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. బీట్ రూట్ లో నైట్రేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. 

88
hemoglobin

యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పండు రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి తోడ్పడుతుంది. 

  

Read more Photos on
click me!

Recommended Stories