పిల్లలు తినడానికి ఏడిపిస్తున్నారా? లేక ఎక్కువగా తినేస్తున్నారా? అయితే ఈ రాశి వారే అయుంటారు...

First Published | Jul 8, 2022, 12:45 PM IST

కొంతమంది పిల్లలు ఏం పెట్టినా ప్లేటు మొత్తం శుభ్రంగా ఖాళీ చేసేస్తారు. మరికొంతమంది విపరీతంగా సతాయిస్తారు. జంక్ ఫుడ్ ఇష్టపడతారు. తింటూనే ఉంటారు... ఇలా పిల్లల ఫుడ్ హాబిట్స్ రకరకాలుగా ఉంటాయి. దీనికి కారణం వారి రాశులే.. 

మేషరాశి : వీరు గబగబా తినేస్తారు. తొందరగా ముగించడానికి ఇష్టపడతారు. బాక్సులో పెట్టింది, కంచంలో పెట్టింది వదిలిపెట్టరు. పూర్తిగా తినేస్తారు. ఆహారాన్ని వృధా చేయడం వీరికి ఇష్టం ఉండదు. 

వృషభరాశి : ఈ రాశి పిల్లలు ఎప్పుడూ తింటూనే ఉంటారు. ఏదైనా సరే తినడంఇష్టం. అందుకే ఒబేసిటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. తినేటప్పుడు వారిని ఎవరైనా డిస్ట్రబ్ చేయడం, మాట్లాడించడం ఇష్టముండదు.


మిధునరాశి : ఈ రాశి పిల్లలు శరీరానికి అవసరమైందే తింటున్నామా అనేది పెద్దగా పట్టించుకోరు. కాకపోతే రుచిగా ఉందా? లేదా? అనేది చూసుకుంటారు. తినేప్పుడు మంచి కంపెనీ కోరుకుంటారు. 

కర్కాటకరాశి : ఆహారం విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటారు. ఎమోషనల్ గా కూడా ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి ఎక్కువగా తినేస్తుంటారు. 

Leo Zodiac

సింహరాశి : మంచి ఆకలి వీరి సొంతం. కొత్తకొత్త రుచులు ప్రయత్నించడం వీరికి ఇష్టం. ఆహారానికి సంబంధించిన సంభాషణ ఇష్టపడతారు. అయితే, కూరగాయలు, పండ్లు వీరికి పెద్దగా ఇష్టం ఉండవు. 

కన్యారాశి : చిన్నపిల్లలైనా ఈ రాశివారిలో ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ ఉంటుంది. అందుకే అనారోగ్యకరమైన ఆహారం, అనవసరపు ఆహారాల జోలికి వెళ్లరు. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తీసుకుంటారు. ఎప్పుడైనా ఫంక్షన్లు, పెళ్లిళ్లలో మాత్రం అన్నీ తినేస్తారు. 

తులారాశి : వీరికి స్వీట్లంటే చాలా ఇష్టం. ఫ్యాన్సీ ఐటమ్స్ ను ఇష్టపడతారు. వీటివల్ల ఆరోగ్యం పాడవుతుందన్నా పట్టించుకోరు. 

వృశ్చికరాశి : వీరు పులుపు, మసాలా, కారాలను బాగా ఇష్టపడతారు. దీనివల్ల జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతారు. అందుకే, త్వరగా డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం అవసరం.

ధనుస్సురాశి : ఈ రాశి పిల్లలు రకరకాల ఆహారాలను రుచి చూడడానికి బాగా ఇష్టపడతారు. ప్రయోగాలు చేస్తారు. దీనివల్ల కొన్ని సార్లు అతిగా తినేస్తారు కూడా. 

మకరరాశి : తిండి విషయంలో చాలా క్రమశిక్షణతో ఉండేది ఈ రాశి పిల్లలే. తమ ఆహారం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఇంట్లో వండిన ఆహారాన్నే ఇష్టపడతారు. జంక్ ఫుడ్ ఆలోచనే వీరికి రాదు. 

Aquarius

కుంభరాశి : వీరికి పెద్దగా పట్టింపులు, రొటీన్లు ఉండవు.. ఎప్పుడు ఆకలైతే అప్పుడు... ఏదైనా తినేస్తారు. లేట్ నైట్.. బింజ్ ఈటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

Pisces Zodiac

మీనరాశి : వీరు పుడీలు. ఆహారాన్ని బాగా ఇష్టపడతారు. మనసుకు నచ్చింది తినేస్తారు. వీరితో స్నేహం, ప్రేమ, అనుబంధం పెంచుకోవాలంటే ఆహారమే బెస్ట్ రూట్. తమకిష్టమైన ఆహారం చూస్తే బాగా కంఫర్ట్ గా ఉంటారు. 

Latest Videos

click me!