స్ట్రెస్ తగ్గాలంటే వీటిని తినండి చాలు..

First Published Nov 21, 2022, 10:53 AM IST

ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తింటే ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఒత్తిడి నుంచి తొందరగా బయటపడకపోతే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. 
 

నేడు చాలా మంది ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒత్తిడికి కారణాలు చాలానే ఉన్నాయి. వర్క్ టెన్షన్స్, పనిలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మొదలైన సమస్యల వల్ల స్ట్రెస్ కు గురవుతాం. విటమిన్ సి, విటమిన్ బి, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది.
 

మీకు తెలుసా.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఒత్తిడి స్థాయిని విపరీతంగా పెంచుతాయి. దీన్ని సకాలంలో పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2016 జూన్ లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ & ఫుడ్ సైన్సెస్ లో ప్రచురించబడిన ఒక సమీక్షలో..  ఒత్తిడిని విటమిన్ బి, విటమిన్ సి, సెలీనియం, మెగ్నీషియం వంటి కొన్ని పోషకాలు తగ్గిస్తాయని వెల్లడైంది. 
ఆగస్టు 2015 లో జర్నల్ స్ట్రెస్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. కాలక్రమేణా మీరు తీసుకునే పోషకాల మొత్తం, నాణ్యత మీ మానసిక స్థితిని నియంత్రించే శరీరం నాడీ వలయాలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.

గట్ ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అని న్యూయార్క్ నగరానికి చెందిన పోషకాహార నిపుణుడు, ఆలిస్ ఇన్ఫెడిల్యాండ్ వ్యవస్థాపకుడు ఆలిస్ ఫిగురోవా చెప్పారు. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లను ఇష్టపడని వారుండరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డార్క్ చాక్లెట్స్ రెండు విధాలుగా ఒత్తిడిని తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఎపికాటెచిన్, కాటెచిన్ వంటి ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు. 
 

కార్బోహైడ్రేట్లు

పలు పరిశోధన ప్రకారం.. కార్బోహైడ్రేట్లు తాత్కాలికంగా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. 
 

అవొకాడో

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు అవొకాడోలో మంచి వనరులు. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. ఆరోగ్యకరమైన ఈ ఆవశ్యక ఆమ్లాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. ఏకాగ్రతను కూడా పెంచుతాయి. ముఖ్యంగా ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి.
 

కొవ్వు చేపలు

కొవ్వు చేపలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఇవి ఒత్తిడితో పోరాడతాయి. అలాగే గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. హార్వర్డ్ హెల్త్ బ్లాగ్ ప్రకారం.. కొవ్వు చేపలను తినడం మంచి ఎంపిక. ఎందుకంటే ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు నిరాశను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

calcium

కాల్షియం

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.  2012 డిసెంబర్ లో జర్నల్ న్యూట్రిషన్ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ పోషకం నిరాశను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే పాలు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకుంటే కండరాలు సడలించబడతాయి. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. 
 

click me!