చక్కెరలోని రకాలు
సాధారణంగా చక్కెరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజ చక్కెర. రెండోది ప్రాసెస్ చేయబడ్డ చక్కెర, కొబ్బరి, పైనాపిల్, మామిడి, లీచి వంటి పండ్ల ద్వారా మనకు సహజ చక్కెర లభిస్తుంది. అయితే ప్రాసెస్ చేయబడ్డ చక్కెరను బీట్ రూట్, చెరుకు నుంచి తయారు చేస్తారు. అయితే చక్కెరను మోతాదులో తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ పూర్తిగా వదులుకుంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.