నరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆహారాలను తినండి.. నొప్పి మటుమాయం అవుతుంది

Published : Sep 05, 2022, 12:59 PM IST

ఈ రోజుల్లో నరాల నొప్పి సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. చెడు ఆహారాలను తినడం వల్ల కూడా నరాల నొప్పి పుడుతుంది. ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల నరాలు బలహీన పడి నొప్పి పుడుతుంది.  

PREV
19
 నరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆహారాలను తినండి.. నొప్పి మటుమాయం అవుతుంది

చిన్న వయసు వారు సైతం నరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈ నొప్పి సిరల్లో అడ్డంకి వల్ల కలుగుతుంది. అంటే సిరల్లో రక్తప్రసరణ సరిగ్గా జరకుంటే నొప్పి పుడుతుందన్న మాట. ఈ నరాల నొప్పి ఎక్కువైతే అవి ఉబ్బి సమస్య మరింత పెద్దది అవుతుంది. ఇలాంటి సమయంలో చికిత్స చేయకపోతే మీ నరాలు దెబ్బతింటాయి. 

29

నరాల నొప్పికి కారణాలు

మీ శరీరంలో విటమిన్ బి కాంప్లెక్స్  లేకపోతే కూడా నరాల నొప్పి పడుతుంది. అలాగే విటమిన్ బి 12, విటమిన్ బి6 వంటివి లోపిస్తే కూడా నరాల నొప్పి కలుగుతుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో విటమిన్ బి పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చండి. ఇవి మీ నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది. నరాలు దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

39

విటమిన్ బి 12 రిచ్ ఫుడ్స్

విటమిన్ బి  పుష్కలంగా ఉండే ఆహారాలు నరాల నొప్పిని తగ్గిస్తాయి. మరి ఏయే ఆహారాల్లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం పదండి.. 

పాలు, పాల ఉత్పత్తులైన జున్ను, పెరుగు, మజ్జిగ వంటి ఆహారాల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల నరాల నొప్పి తగ్గుతుంది. 
 

49

ఓట్స్, సోయా బీన్స్ వంటి ధాన్యాల్లో కూడా విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అలాగే సాల్మన్, చేపలు, ట్యూనా వంటి సీ ఫుడ్స్ లో కూడా విటమిన్ బి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

59

బచ్చలి కూర, చిక్పీస్, పుట్టగొడుగులు, అరటిపండ్లు, క్యారెట్లు, చిలగడదుంపల్లో కూడా విటమిన్ బి ఉంటుంది. ఈ ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ బి లోపం తొలగిపోయి.. నరాల నొప్పి తగ్గిపోతుంది. 
 

69

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కూడా నరాల నొప్పులు తగ్గుతాయి. ఇందులో వాల్ నట్స్, బాదం, ఆప్రికట్లు, పిస్తా, ఎండిన ద్రాక్షలను రోజూ తినండి. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తింటే మంచి ఫలితాలను పొందుతారు. 
 

79

గ్రీన్ టీ, చమోమిలే టీ లు కూడా నరాల నొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, టెర్పెనాయిడ్లు ఒత్తిడి, ఆందోళన  వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి నరాల నొప్పిని కూడా తగ్గిస్తాయి. 
 

89

బెర్రీలు కూడా నరాల నొప్పిని తగ్గిస్తాయి. ఇందుకోసం బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలను రోజూ తినండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాంటయి. ఇవి నరాల నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

99

డార్క్ చాక్లెట్స్ కూడా నరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. నొప్పులను కూడా తగ్గిస్తాయి.  

Read more Photos on
click me!

Recommended Stories