క్యాన్సర్ కు చికిత్స
దానిమ్మ పండుపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇది క్యాన్సర్ నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది కూడా. ఈ పండులోని పాలీఫెనాల్ కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు డీఎన్ఏ ను కాపాడుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణితి పెరగకుండా ఈ పండు నిరోధిస్తుంది. అంటే ఇది క్యాన్సర్ వ్యాప్తిని నివారిస్తుందన్న మాట. అయితే దీనిపై మరిన్ని అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ దానిమ్మ పండు రొమ్ము, ప్రోస్టేట్, పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధించగలవని కూడా నిరూపించబడింది.