టూత్ పేస్ట్ దంతాలనే కాదు.. వీటిని కూడా తెల్లగా మెరిపిస్తుంది..

First Published Sep 5, 2022, 11:55 AM IST

సాధారణంగా మనం టూత్ పేస్ట్ ను కేవలం దంతాలను క్లీన్ చేయడానికే ఉపయోగిస్తాం. కానీ దీనితో ఎన్నో వస్తువులను కూడా తెల్లగా నిగనిగలాడేలా చేయొచ్చు. 
 

టూత్ పేస్ట్ దంతాలను శుభ్రం చేయడానికే పనికొస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ దీనితో ఎన్నో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ టూత్ పేస్ట్ ఎన్నో వస్తువులతో తయారవుతుంది. మనం ఉపయోగించే టూత్ పేస్ట్ లో ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఎంత మొండిమరకలనైనా ఇట్టే తొలగిస్తాయి. టూత్ పేస్ట్ ను ఉపయోగించి ఇంట్లో ఏయే వస్తువులను క్లీన్ చేయొచ్చొ తెలుసుకుందాం పదండి. 

ఫోన్ కవర్

ఫోన్  ను గానీ.. దానీ కవర్ ను గానీ సపరేట్ గా శుభ్రం చేసుకోలేం. అందుకే దీనిపై మరకలు పడితే అలాగే ఉంటాయి. దీంతో అవి చండాలంగా కనిపిస్తాయి. అయితే టూత్ పేస్ట్ ను ఉపయోగించి ఫోన్ కవర్ ను శుభ్రంగా చేసుకోవచ్చు. ఇందుకోసం టూత్ పేస్ట్ ను కవర్ మీద 2 నుంచి 3 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. దీనివల్ల పసుపు మరకలు సులువుగా తొలగిపోతాయి. 
 

లిప్ స్టిక్ మరకలు

బట్టలకు అంటిన లిప్ స్టిక్ మరకలు అంత సులువుగా వదిలిపోవు. దీన్ని ఎంత  వాష్ చేసినా.. అలాగే కనిపిస్తాయి. అయితే ఈ మరకలను వదిలించడంలో టూత్ పేస్ట్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం లిప్ స్టిక్ మరకలు అంటిన ప్లేస్ లో టూత్ పేస్ట్ ను అప్లై చేసి కాసేపు అయినాక బ్రష్ తో క్లీన్ చేస్తే  మరకలు మటుమాయం అవుతాయి. 
 

టీ మరకలు

టేబుల్ పై పడ్డ టీ మరకలు అస్సలు వదలవు. అందులోనూ టీ మరకలు చాలా సేపటి వరకు అలాగే ఉంటే అవి మొండిగా తయారవుతాయి. వీటిని ఏం చేసినా తొలగించలేం. అయితే ఈ మరకలకు కాస్త టూత్ పేస్ట్ ను అప్లై చేసి.. కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేస్తే మరకలు మటుమాయం అవుతాయి.. 
 

ఆభణాలు తెల్లగా కావడానికి

వెండి ఆభరణాలు చాలా  రోజులకు పాతబడి నల్లగా అవుతాయి. అయితే వాటిని శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బును యూజ్ చేస్తుంటారు. అయినా అవి కొంచెం కూడా తెల్లబడవు. అయితే టూత్ పేస్ట్ వెండి ఆభరణాలను తెల్లగా మెరిపించేయొచ్చు. ముఖ్యంగా పట్టీలను చాలా తొందరగా తెల్లగా చేస్తాయి. 20 నిమిషాల పాటు వెండి ఆభరణాలకు టూత్ పేస్ట్ ను అప్లై చేసి బ్రష్ తో క్లీన్ చేస్తే నలుపుదనం అంతా పోతుంది. 

click me!