వర్షాకాలంలో అలెర్జీతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఫుడ్స్ ను తినండి..

First Published Aug 5, 2022, 3:17 PM IST

వర్షకాలంలో ఎక్కడ లేని రోగాలన్నీ చుట్టుకుంటాయి. ముఖ్యంగా అలెర్జీ చాలా మందిని ఇబ్బందిని పెడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలను తప్పక పాటించాల్సిందే మరి..!
 

రుతుపవనాల రాకతో వాగులు నిండుకుండల్లా మారుతాయి. వర్షాలు సంతోషాన్నే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా మోసుకొస్తుంది. దుమ్ము, దూళీ, మురికి కణాలు అలెర్జీని మరింత ఎక్కువ చేస్తాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.

వైరల్ ఇన్ఫెక్షన్లకు, జ్వరం, జలుబుకు కారణమయ్యే వైరస్ లు, బ్యాక్టీరియాలకు తడి బట్టలు, గాలిలోని తేమ, బూట్లు దీనికి ఆవాసాలు. ఈ ప్లేసెస్ లోనే అవి సంతానోత్పత్తి చేస్తాయి. దీనికి తోడు మనం తినే ఆహారాలే మనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ సీజన్ లో మంచి పోషకాహారం తినాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే అలెర్జీ సమస్య నుంచి బయపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీజనల్ ఫ్రూట్స్   (Seasonal fruits)

సీజనల్ పండ్లను తప్పకుండా తినాలి. అందులో జామ, ఆపిల్,చెర్రీలు, లిచీ, పీచ్, ప్లమ్,బొప్పాయి, దానిమ్మ వంటి సీజనల్ పండ్లను వర్షాకాలంలో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎన్నో రకాల రోగాలు కూడా దూరమవుతాయి. ఈ సీజన్ లో పుచ్చకాయ, జామకాయలను తినకండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే నీరు జులుబును కలిగిస్తుంది. 
 

టీ , సూప్

గ్రీన్ టీ, అల్లం టీ, సూప్ లను వర్షాకాలంలో తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. అందులో కూరగాయలు, పప్పు సూప్ లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సీజన్ లో వేడివేడి సూప్ ను తీసుకోవడం వల్ల అలెర్జీ సమస్య తగ్గుతుంది. 
 

మజ్జిగ, పెరుగు

పాల బదులుగా మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని చాలా మంది డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే పాలను సరిగ్గా మరిగించకపోతే.. దీనిలో వ్యాధికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే పాలకు బదులుగా పెరుగు, మజ్జిగను తీసుకోమని సలహానిస్తుంటారు. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడతుంది.
 

ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు

పండ్ల రసాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఆరెంజ్, ఆపిల్ వంటి పండ్ల రసాలను ఇంట్లోనే తయారుచేసుకుని తాగితే రుచితో పాటుగా ఎన్నో రకాల రోగాలు సైతం దూరమవుతాయి. ఆపిల్ జ్యూస్ ను తరచుగా తాగడం వల్ల కాలేయం నుంచి విషం బయటకు పోతుంది. అలాగే పిహెచ్ స్థాయి పెరుగుతుంది. కడుపు సమస్యలు తగ్గుతాయి. 
 

ఆరెంజ్ జ్యూస్ ను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియను కూడా పెరుగుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. వర్షాకాలంలో సాధారణంగా సోకే మలేరియా, డయేరియా వంటి  వ్యాధుల ప్రమాదాలను కూడా ఈ జ్యూస్ తగ్గిస్తుంది. 
 

అల్లం, వెల్లుల్లి

అల్లం, వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరం, జలుబు ను తగ్గిస్తాయి. అల్లం టీ తాగడం వల్ల గొంతు నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు తొలగిపోతాయి. యాంటీ మైక్రోబయల్/యాంటీ ఫంగల్ లక్షణాలతో వెల్లుల్లిని చట్నీలు, గ్రేవీలు, సూప్ లు, ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు.
 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

 ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సీజన్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల నీటి ద్వారా సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చేపలు, రొయ్యల్లో ఎక్కువగా ఉంటుంది. 
 

click me!