Travel: ఇండియాలో మీరు తప్పకుండా చూడాల్సిన అత్యంత అందమైన ప్లేసెస్ ఇవే..

First Published Aug 5, 2022, 2:24 PM IST

Travel:  భారత దేశ భౌగోళిక స్వరూపం వైవిధ్యభరితమైంది. ఉత్తరాన మంచు కొండలతో ఉన్న హిమాలయాలు, పశ్చిమాన ఇసుగ దిబ్బలు, తూర్పున మైమరిపించే కొండలు, భూములు, దక్షిణాన 7,500 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరం. మనం అనుకుంటాం కానీ.. మన దేశంలో మనం తప్పకుండా చూడాల్సిన అందమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచాన్ని కాదు.. ముందుగా మన దేశంలో ఉన్న అందమైన ప్లేస్ ను చూడండి.. కళ్లు చెదురుతాయి.. 
 

యమ్తాంగ్ లోయ- సిక్కిం

భారతదేశంలోని అందమైన ప్రదేశాల్లో యుమ్తాంగ్ లోయ ముందు ప్లేస్ లో ఉంటుంది. ఎందుకో తెలుసా.. ఇక్కడ అడుగడుగునా రకరకాల పువ్వులు మనల్ని పలకరిస్తాయి. అందమైన శిఖరాలతో ఈ లోయ మైమరిపిస్తుంది. అందుకే భారతదేశాన్ని చుట్టి వద్దామనుకునే వారు ముందుగా ఈ ప్లేస్ కు వెళ్లండి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ లోయకు వెళితే బాగా ఎంజాయ్ చేస్తారు. 

సమీప విమానాశ్రయం: బాగ్డోగ్రా విమానాశ్రయం

స్టోక్ కాంగ్రీ- లడఖ్

ఇక ఇండియాలో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో స్టోక్ కాంగ్రీ శిఖరం రెండో ప్లేస్ లో ఉంటుంది. ఇది 6,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ట్రిక్కింగ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.  జూన్ నుంచి సెప్టెంబర్ లో ఇక్కడికి వెళితే బాగుంటుంది. 

సమీప విమానాశ్రయం: కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం.. లేహ్

నుబ్రా లోయ - లడఖ్ 

రకరకాల తోటలు, బాక్ట్రియనన్ ఒంటెలు, మఠాలకు ఈ ప్రదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులతో చుట్టుకుని ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా అందమైన ఇసుక దిబ్బలు, మఠాలు, శిథిలావస్థకు చేరిన రాజభవనం వంటి భిన్నమైన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఇది ఒకటిగా కొనసాగుతోంది. 

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు: సంస్టాన్లింగ్ మొనాస్టరీ, డిస్కిట్ గొంపా, పనమిక్ విలేజ్, యారాబ్ త్సో సరస్సు, హండర్ శాండ్ డ్యూన్స్.  జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ ప్లేస్ కు వెళ్లొచ్చు.

సమీప విమానాశ్రయం: కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం, లేహ్
 

నోహ్కలికై జలపాతం -చిరపుంజి 

నొహ్కలికై జలపాతాలు చిరపుంజీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇది ప్రపంచంలోని నాల్గవ అత్యంత ఎత్తైన జలపాతం. 1,100 అడుగుల ఎత్తు నుంచి పడుతున్నజలపాతం చిరపుంజికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందుకే ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల జాబితాలో స్థానం పొందింది. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..ఈ వాటర్ శీతాకాలంలో నీలం రంగులో ఉంటుంది. వేసవి నెలల్లో ఆకుపచ్చగా మారుతుంది. వర్షాకాలంలో వెళితే బాగా ఎంజాయ్ చేస్తారు.

సమీప విమానాశ్రయం: ఉమ్రాయి విమానాశ్రయం, షిల్లాంగ్

Nanda Devi Peak

నందా దేవి- ఉత్తరాఖండ్ 

నందా దేవి ప్రపంచంలోని రెండవ అత్యంత ఎత్తైన శిఖరం. ఇక్కడ నందా దేవి జాతీయ ఉద్యానవనం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఈ ఉద్యాన వనంలో రకారకాల వృక్షాలు, జంతులు ఉంటాయి. ఈ జంతుజాలంలో గోధుమ, హిమాలయ నల్ల ఎలుగుబంట్లు, హిమాలయన్ తాహ్ర్, మంచు చిరుత పులులు, సెరో, చీర్ ఫీసెంట్స్ ఉంటాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇక్కడకు వెళ్లొచ్చు.

సమీప విమానాశ్రయం: జాలీ గ్రాంట్ విమానాశ్రయం, డెహ్రాడూన్

డ్రాంగ్ డ్రంగ్ గ్లేసియర్- కార్గిల్ దగ్గర 

22 కిలోమీటర్ల పొడవైన డ్రాంగ్-డ్రంగ్-హిమానీనదం లడఖ్ ప్రాంతంలోని పర్యాటకులకు అందుబాటులో ఉన్న అతిపెద్ద హిమానీనదం. లేహ్-జాన్స్కర్ లోయ నుంచి మూడు రోజుల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన హిమానీ నదాలు, అద్భుతమైన పర్వత శ్రేణులను, పండ్ల తోటలను చూస్తారు. ఇక్కడకు సంవత్సరం పొడవునా వెళ్లొచ్చు.
 

సమీప విమానాశ్రయం: కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం, లేహ్

Andaman and Nicobar Islands

అండమాన్ నికోబార్ దీవులు 

భారతదేశంలో ఉన్న బెస్ట్ హనీమూన్ ప్లేసెస్ లో ఇది అత్యంత అందమైన ప్రదేశంగా చెప్పొచ్చు. అందమైన అపారదర్శక పచ్చని జలాలు, ప్రధాన అరణ్యాలు, మడ అడవులు, సూర్యాస్తమయాల సమయంలో కరిగిపోయే మంచు మనల్ని కట్టిపడేస్తాయి. ఇక్కడికి అక్టోబర్ నుంచి మే వరకు వెళ్లొచ్చు.

సందర్శించాల్సిన ప్రదేశాలు: సెల్యులార్ జైలు నేషనల్ మెమోరియల్, రాధానగర్ బీచ్, హేవ్ లాక్ ఐలాండ్, సీఫుడ్ రెస్టారెంట్లు. 

ప్రధాన విమానాశ్రయం: వీర్ సావర్కర్ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్
 

Khajjiar

ఖజ్జియార్- హిమాచల్ ప్రదేశ్ 

మినీ స్విట్జర్లాండ్ అయిన ఖాజ్జియార్ భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. హిమాచల్ ప్రదేశ్ లోని డల్హౌసీకి 26 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ అయిన ఖాజ్జియార్ ను హిమాచల్ ప్రదేశ్ కు చెందిన గుల్మార్గ్ అని కూడా పిలుస్తారు. విస్తారమైన ఆకుపచ్చని పచ్చిక బయళ్లు, దట్టమైన అడవులతో పాటు గంభీరమైన మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలతో అందంగా ఉంటుంది. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇక్కడకు వెళ్లొచ్చు.

సందర్శించాల్సిన ప్రదేశాలు: కలాటాప్ వన్యప్రాణుల అభయారణ్యం, నైన్ హోల్ గోల్ఫ్ కోర్స్, దాల్ లేక్, కైలాష్ గ్రామాలు, ఖాజ్జియార్ సరస్సు

 సమీప విమానాశ్రయం: గగ్గల్ విమానాశ్రయం, కాంగ్రా
 

click me!