High Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ అలవాట్లను మానుకోవాల్సిందే..

Published : May 27, 2022, 02:30 PM ISTUpdated : May 27, 2022, 02:32 PM IST

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా తినడం, ఎక్కువ వ్యాయామం చేయడం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు.

PREV
18
High Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ అలవాట్లను మానుకోవాల్సిందే..
High Cholesterol

అధిక కొలెస్ట్రాల్ (High Cholesterol) నేడు చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక కారకాలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. అధిక కొలెస్ట్రాల్ ధమనుల సంకోచానికి కారణమవుతుంది. ఇది రక్తపోటు (Blood pressure)ను పెంచుతుంది. అంతేకాదు రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది కూడా.

28
High Cholesterol

అధిక కొలెస్ట్రాల్ అనేది రక్తంలోని కొవ్వు పదార్థం. ఇది కొవ్వు పదార్థాలు తినడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ధూమపానం (SMOKING), మద్యపానం వల్ల వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. ఇది గుండెపోటు(Heart attack), స్ట్రోక్ (Stroke)ప్రమాదాన్ని పెంచుతుంది.

38

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువ సేపు వ్యాయామం చేయడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

48

ఆరోగ్యకరమైన ఆహారాలు (Healthy foods) తినండి.. ఆహారంలో కొన్ని మార్పులు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా సంతృప్త కొవ్వులను (Saturated fats)తగ్గిస్తేనే మీరు కొలెస్ట్రాల్ ను తగ్గించగలరు.  ఎర్ర మాంసం, పాల ఉత్పత్తులలో (dairy products) ఉండే సంతృప్త కొవ్వులు మొత్తం కొలెస్ట్రాల్ ను పెంచేస్తాయి. అందుకే సంతృప్త కొవ్వులను తీసుకోవడం తగ్గించాలి. దీనివల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్డిఎల్) కొలెస్ట్రాల్ ను, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

58

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega 3 fatty acids) అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు .. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, వాల్ నట్స్, అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్స్ కొలెస్ట్రాల్ ను రక్తప్రవాహంలోకి శోషించుకోవడాన్ని తగ్గిస్తాయి. ఓట్స్, కిడ్నీ బీన్స్, ఆపిల్స్, పియర్స్ వంటి ఆహారాలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

68

వ్యాయామం అధిక కొలెస్ట్రాల్ (Exercise)ను తగ్గిస్తుంది.. వ్యాయామం అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) కొలెస్ట్రాల్, "Good" cholesterol ను పెంచడానికి సహాయపడుతుంది. వారానికి ఐదుసార్లు కనీసం 30 నిమిషాలు లేదా వారానికి మూడు సార్లు 20 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం (Aerobic exercise)చేయండి.

78
smoking

ధూమపానం (SMOKING) మానేయండి.. ధూమపానం రక్తంలో  "చెడు" కొలెస్ట్రాల్ (LDL) ను పెంచుతుంది.  HDL లేదా మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనులలో పేరుకుపోవడానికి దారితీస్తాయి. ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

88

ఆల్కహాల్ (Alcohol).. ఆల్కహాల్ తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides), కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే అవి కాలేయంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్ (Fatty liver)వ్యాధికి కారణమవుతాయి. కాలేయం సరిగ్గా పనిచేయలేక రక్తం నుంచి కొలెస్ట్రాల్ ను తొలగించలేకపోతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి.

click me!

Recommended Stories