వీర్యకణాల సంఖ్య పెరగాలా? అయితే ఇవి తినండి..

First Published | Nov 29, 2022, 5:18 PM IST

స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఒక్కటేమిటీ ఎన్నో కారణాలుంటాయి. కారణమేదైనా.. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. దీనివల్ల గర్భధారణ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలను తింటే వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. 

ఈ రోజుల్లో చాలా మంది మగవారు తక్కువ వీర్య కణాల సంఖ్య సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. ఇది పిల్లలు పుట్టే అవకాశాలను తగ్గిస్తుంది. వాయు కాలుష్యం, వ్యాయామం లేకపోవడం, పర్యావరణ కాలుష్యం, పురుగుల మందులు అవశేశాలు, స్మోకింగ్, డ్రింకింగ్, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. వీర్యం నాణ్యత కూడా తగ్గుతుంది. నిద్రలేమి, ఒత్తిడి, మధుమేహం వంటివి కూడా వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి. 
 

sperm

వీర్యకణాల సంఖ్య పెరగాలంటే మందును ఎక్కువగా తాగడకూడదు. స్మోకింగ్ మానేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. వీటితో పాటుగా కొన్ని రకాల ఆహారాలు కూడా స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు సహాయపడతాయి. అవేంటంటే.. 


గుడ్లు: గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి వీర్యాన్ని ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అందేకాదు వీర్యకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు సహాయపడతాయి. 

పాలకూర: పాలకూరలో ఐరన్ కంటెంట్ తో పాటుగా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ వీర్యకణాల సంఖ్య పెరిగేందుకు, ఎదిగేందుకు సహాయపడుతుంది. 
 

అరటిపండ్లు: అరటిపండ్లు కూడా వీర్యకణాల సంఖ్యను పెంచేందుకు ఇవి యాక్టీవ్ గా కదిలేందుకు సహాయపడతాయి. అరటిలో విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఇతర పోషకాలతో పాటుగా బ్రొమిలేన్ అనే ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ ను పెంచడమే కాదు.. స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. 
 

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచే ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి వీర్యకణాల సంఖ్యను పెంచుతాయి. అలాగే రక్త ప్రసరణను పెంచుతుంది. 
 

దానిమ్మ: దానిమ్మ మన శరీరంలో రక్తాన్ని పెంచడమే కాదు.. పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. అంతేకాదు ఈ గింజలు వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 
 

tomatoes

టమాటాలు: టమాటాలు స్పెర్మ్ నాణ్యతను ప్రోత్సహిస్తాయి. అలాగే వీర్యకణాల సంఖ్యను పెంచడానికి కూడా సహాయపడుతుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది సంతాన సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. 

డార్క్ చాక్లెట్స్:  డార్క్ చాక్లెట్లు కూడా సంతానలేమి సమస్యను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఎల్ ఆర్గినైన్ హెచ్ సీఎల్ అనే అమైనో ఆమ్లం వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. 
 

Latest Videos

click me!