ధనియాలు (Coriander seeds)
ప్రతి వంటగదిలో ధనియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలను రుచిగా చేయడమే కాదు.. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలుంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.