ఎంతో రుచికరమైన క్రిస్పీ రాగి పిండి బిస్కెట్లు.. ఎలా చెయ్యాలంటే?

Published : Jul 18, 2022, 03:31 PM IST

పిల్లలు ఇంటిలో రొటీన్ గా చేసే స్నాక్ ఐటమ్స్ (Snack Items) ను తినడానికి పెద్దగా ఇష్టపడరు. వీరికి వెరైటీ స్నాక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.   

PREV
18
ఎంతో రుచికరమైన క్రిస్పీ రాగి పిండి బిస్కెట్లు.. ఎలా చెయ్యాలంటే?

చాలామంది పిల్లలకు బిస్కెట్లు అంటే ఇష్టం ఉంటుంది. అయితే బిస్కెట్లు ఇంట్లోనే హెల్తీగా రాగి పిండితో తయారుచేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే రాగి పిండి బిస్కెట్లు (Ragi flour biscuits) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

28

బయట మార్కెట్ లో మైదాతో (Maida) తయారుచేసిన బిస్కెట్లు ఎక్కువగా దొరుకుతాయి. మైదా బిస్కెట్లు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఇలా బిస్కెట్లను బయటినుంచి తెచ్చుకునే బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో చేసుకునే బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి (Good for health). 
 

38

కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి  (Ragi flour), సగం కప్పు చక్కెర (Sugar), పావు కప్పు గోధుమ పిండి (Wheat flour), అరకప్పు వెన్న (Butter), మూడు యాలకులు పొడి (Cardamom), చిటికెడు ఉప్పు (Salt), తగినన్ని పాలు (Milk), కొన్ని జీడిపప్పు (Cashew nuts) పలుకులు .
 

48

తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని చక్కెర, యాలకులను వేసి మెత్తగా  గ్రైండ్ (Grind finely) చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, గోధుమపిండి, మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి, చిటికెడు ఉప్పు, వెన్న వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

58

ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలను (Boiled and cooled milk) కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని బిస్కెట్లు చేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని కలుపుకునే విధానాన్ని బట్టి బిస్కెట్లు బాగా వస్తాయి. కనుక పిండిని మరీ మెత్తగా, గట్టిగా కాకుండా చపాతీ పిండిలా  మెత్తగా (Soft dough) కలుపుకోవాలి.
 

68

ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో ప్లేట్ కానీ, స్టాండ్ కానీ పెట్టి పది నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఫ్రీ హీట్ (Preheat) చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చేతివేళ్లతో బిస్కెట్ల ఆకారంలో గుండ్రంగా వత్తుకోని పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.
 

78

ఇలా చేసుకున్న బిస్కెట్లను వెన్నెరాసి పొడి పిండి చల్లుకున్న ప్లేట్లో ఉంచి ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట్టి తక్కువ మంట మీద 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ (Bake) చేసుకోవాలి. 30 నిమిషాల తరువాత మూత తీసి బేక్ అయిన బిస్కెట్లను బయటకు తీసి చల్లారాక (After cooling) సర్వ్ చేస్తే సరి. 
 

88

అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే రాగి పిండి బిస్కెట్లు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిస్కెట్లను ఒకసారి ట్రై చేయండి. ఈ బిస్కెట్లు క్రిస్పీగా (Crispy) చాలా రుచిగా ఉంటాయి. మీ పిల్లలకు తప్పక నచ్చుతాయి.

click me!

Recommended Stories