ఇవి తింటే చాలు.. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.. ఈజీగా బరువు కూడా తగ్గుతారు..

First Published Dec 1, 2022, 9:40 AM IST

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా ఎన్నో అంటువ్యాధులు సోకుతాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 
 

కోవిడ్ -19 మహమ్మారి రాకతో చాలా మందికి రోగనిరోధక శక్తి ప్రాముఖ్యత గురించి తెలిసొచ్చింది. నిజానికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లే కరోనా వల్ల ఎక్కువగా చనిపోయారని నిపుణులు చెబుతున్నారు. 

ఒత్తిడి, పేలవమైన ఆహారం,  నిశ్చల జీవనశైలి ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఇవి బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ దాల్చినచెక్క జీవక్రియను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఉదయం పరిగడుపు దాల్చినచెక్క నీటిని తాగడం వల్ల ఆకలిని చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు బరువు సులువుగా తగ్గొచ్చు. ఈ నీరు రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడమే కాదు..  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కూడా..

black pepper

నల్లమిరియాలు

నల్ల మిరియాలు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలు శరీరంలోని అడ్డంకులను తగ్గిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. నల్ల మిరియాలు శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి కూడా సహాయపడుతాయి.
 


అల్లం

అల్లం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అల్లం జీవక్రియను 20 శాతం పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. బాడీలోని విషాన్ని బయటకు పంపుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు కూడా సహాయపడతాయి.
 

lemon

నిమ్మకాయ

నిమ్మకాయలో విటమిన్ సి, కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది. నిమ్మకాయ గుండె జబ్బులు, రక్తహీనత, మూత్రపిండాల్లో రాళ్ళు, జీర్ణ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం, సలాడ్లలో చేర్చడం లేదా నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గుతారు. 

honey

తేనె

తేనె రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు తేనేను తీసుకోవడం వల్ల మీరు నిద్రపోయిన మొదటి గంటల్లో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. తేనెలోని ఆవశ్యక హార్మోన్లు ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల్ని కూడా తగ్గిస్తాయి. అలాగే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. 
 

click me!