ఈ టీ... శృంగార వాంఛ పెంచుతుంది...!

First Published | Nov 30, 2022, 1:09 PM IST

చలికాలంలో వేడి వేడిగా ఒక కప్పు టీ తాగితే వచ్చే మజానే వేరు. చాలా హాయిగా కూడా ఉంటుంది. అయితే... ఆ టీలోని కొన్ని రకాల హెర్బల్స్ వాడటం వల్ల... శృంగార వాంఛ పెరుగుతుంది.

కొన్ని ఆహారాలు తినడం వల్ల కామోధ్దేపన పెరుగుతుందనే విషయం మీకు తెలిసే ఉంటుంది. కేవలం... ఆహారాలు మాత్రమే కాదు... ఒక రకమైన టీ తాగడం వల్ల కూడా శృంగార వాంఛ పెరుగుతుందట. దానిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చట. మరి ఆ టీ ఏంటో ఓసారి చూద్దామా..

చలికాలంలో వేడి వేడిగా ఒక కప్పు టీ తాగితే వచ్చే మజానే వేరు. చాలా హాయిగా కూడా ఉంటుంది. అయితే... ఆ టీలోని కొన్ని రకాల హెర్బల్స్ వాడటం వల్ల... శృంగార వాంఛ పెరుగుతుంది.



టీ తయారు చేసే క్రమంలో.. అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేయడం వల్ల మూడ్ మారుతుంది. మనలో ఏదైనా ఒత్తిడి ఉంటే.... అది తగ్గిపోతుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కూడా తగ్గుతాయి. అదే టీలో అశ్వ గంధ వేయడం వల్ల... నరాలు రిలాక్స్ అవుతాయి. దాని వల్ల...ప్రశాంత మైన నిద్ర కూడా పడుతుంది. అంతేకాకుండా... లిబిడో కూడా పెరుగుతుంది.

మనం తయారు చేసుకునే టీలో దమానియా ఆకులను ఉపయోగించడం వల్ల కామోద్దీపన పెరుగుతుంది. అంతేకాదు... పురుషుల్లో బ్లాడర్ సమస్యలను కూడా ఈ హెర్బల్ టీ పరిష్కరిస్తుంది. టెస్టోస్టెరాన్ లెవల్స్ పెరగడంతో పాటు... సెక్సువల్ ఫంక్షన్ కూడా మెరుగౌతుంది. స్త్రీ, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్య తగ్గుతుంది. సంతాన సమస్యలు కూడా తగ్గుతాయి.

మనం ఇంట్లో టీ తయారు చేసుకునే పద్దతి ఒకసారి చూద్దాం...

టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు... పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు. రెండు చిటికెల్ నట్ మగ్, మూడు టేబుల్ స్పూన్ల ఎండిపోయిన గులాబీ రేకులు, ఒక టీ స్పూన్ అశ్వగంధ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల దామియానా టీ లీఫ్, మూడు యాలకులు, ఒక టీ స్పూన్ మందార పూరేకులు, నీరు, తేనె.


ముందుగా.. నీరు, తేనె తప్పించి.... మిగిలిన పదార్థాలన్నింటినీ మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా ఉన్న ఏదైనా కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి.

తర్వాత... రెండు కప్పుల టీ తయారు చేయడానికి ముందుగా... మూడు కప్పుల నీరు తీసుకోవాలి. ఆతర్వాత.. నీటిని బాగా మరిగించి.. అందులో కాస్త టీ పొడి వేయాలి. టీ రంగు వచ్చేదాకా మరగనివ్వాలి.

అందులోనే ఇందాక తయారు చేసుకున్న పొడిని కూడా వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత....టీని వడపోసుకోవాలి. అంతే.... ఈ టీని రెండు కప్పుల్లో సర్వ్ చేసుకొని ఆస్వాదించడమే. ఈ టీ తాగడం వల్ల.. శృంగార పరంగా చాలా సమస్యలు పరిష్కరమౌతాయి.
 

Latest Videos

click me!