ఈ అలవాట్లతో మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త..!

Published : Aug 23, 2022, 01:56 PM IST

ఒక వయసుకు వచ్చే సరికి మెదడు పనిచేసే సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా చిత్తవైకల్యం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల కూడా మెదడు  ముందుగానే దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
18
ఈ అలవాట్లతో మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త..!

వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటమే కాదు.. మన శరీరంలోని అన్ని అవయవాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తాయి. కానీ శరీరం లోపల అవయవాల్లో జరిగే మార్పుల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోరు. ముఖ్యంగా మెదడులో మార్పులను. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనకు 30 నుంచి 40 ఏండ్లు వచ్చే సరిగ్గా మెదడు పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇక 60 లోకి అడుగుపెట్టినప్పుడు ఇది మరింత వేగం అవుతుంది. అందుకే ఆ వయస్సులోని వారు చిత్తవైకల్యం సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఏదేమైనా వయస్సు మాత్రమే కాదు.. కొన్ని రకాల అలవాట్లు కూడా మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

28
breakfast skipping

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం

బిజీ లైఫ్ కారణంగా చాలా మందికి  ఇంట్లో పనులను చేసుకోవడానికే సరిపడా టైం ఉండదు. దీంతో బ్రేక్ ఫాస్ ను ఎగ్గొడతారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ ను చేయకపోవడం వల్ల శరీరంతో పాటు మెదడును కూడా దెబ్బతీస్తుంది.
 

38

ఆలస్యంగా నిద్రపోవడం

ఈ రోజుల్లో తొందరగా పడుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. ఫోన్ , టీవీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూసుకుంటూ తెల్లవార్లూ మేల్కొంటున్నారు. ఏడ ఐదారు గంటలో పడుకుంటున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యమే కాదు మెదడు కూడా దెబ్బతింటుంది.
 

48
sugar

షుగర్ ను ఎక్కువగా తీసుకోవడం

షుగర్ మెదడు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎప్పుడూ షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే చక్కెర ను మోతాదులోనే ఉపయోగించండి. 
 

58

ఆలస్యంగా నిద్రలేవడం

తెల్లవార్లూ మేల్కొవడం.. ఆలస్యంగా మధ్యాహ్నం అయ్యాక లేవడం.. ఈ అలవాటు ప్రస్తుతం చాలా మందికే ఉంది.  ఈ అలవాటు వల్ల శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా నష్టం జరుగుతుంది. మధ్యాహ్నం నిద్రలేచే వారి అలవాట్లు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇది వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

68

ఇంటర్నెట్ వాడకం

విపరీతమైన ఇంటర్నెట్ వాడకం వల్ల కూడా మెదడు దెబ్బతింటుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఇంటర్నెట్ ను వాడటం వల్ల మెదడు కణాలు నాశనం కావడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ అలవాటును మానుకోండి. అవసరానికి మించి ఎక్కువగా ఉపయోగిస్తే తీవ్రమైన నష్టాల్ని చవిచూడాల్సి వస్తుంది. 
 

78
less sleep

తక్కువ నిద్ర

నిద్ర తక్కువైనా మెదడు కుంచించుకుపోవడానికి కారణమవుతుంది. మెదడుకు ప్రతిరోజూ కొంత సమయం విశ్రాంతి చాలా అవసరం. ఒకవేళ మీరు తగినంత సమయం విశ్రాంతి తీసుకోకపోతే మెదడు దెబ్బతింటుంది. 

88
Alcohol

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం

ఆల్కహాల్ ను విపరీతంగా తాగడం వల్ల కూడా బ్రెయిన్ దెబ్బతింటుంది. ఎక్కువగా తాగేవారి మెదడుకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. దీంతో మెదడు కుంచించుకుపోతుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories