రిలేషన్ షిప్ లో చెప్పే ఈ మాటలు వట్టి అబద్ధాలు

First Published | Dec 8, 2022, 10:54 AM IST

ప్రతి రిలేషన్ షిప్ నిజాయితీగా సాగుతుందన్న గ్యారంటీ లేదు. సమయ, సందర్భాన్ని బట్టి కొంతమంది అబద్దాలు ఆడుతుంటారు. అయితే కొంతమంది తమ భాగస్వాములకు ఎప్పుడూ అబద్దాలే చెప్తుంటారు. ఇలాంటి మాటలను సులువుగా కనిపొట్టేయొచ్చు. ఇంతకీ  ఆ మాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నేను నిన్ను ప్రేమిస్తున్నాను

ఇవి నిజంగా అబద్దాల మాటలే. ఎందుకంటే ప్రేమున్న వ్యక్తి.. తనప్రేమను మాటల రూపంలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ అవతలి వారికి మీ మాటలు, చేతల రూపంలో అర్థమవుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయడం స్టార్ట్ చేస్తే.. మీకు ఎప్పుడూ ఐ లవ్ యూ చెప్తుంటారు.

నువ్వు నాకంటే మంచివాడివి

అసలు ప్రేమలో ఉన్న వారు ఒకరినొకరు పొగుడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరూ సమానమే కాబట్టి. కానీ కొంతమంది నువ్వు నాకంటే చాలా మంచి వాడివి, గొప్పవాడివని ఊరికూరికే పొగుడుతుంటారు. ఇలా అనడానికి కారణం.. వారు మునుపటిలాగా మీ పట్ల ఆసక్తి చూపడం లేదని అర్థం. దాన్ని దాచడానికి మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తారు. 
 

Latest Videos


నా దగ్గర డబ్బులు లేవు

భార్యాభర్తలైతే ఎక్కువగా తమ ఆర్థిక విషయాల గురించి ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఒకరి డబ్బును మరొకరు ఖర్చు చేయకూడదు అనే ఉద్ధేశ్యం కావొచ్చు. మీరు అనవసరంగా డబ్బులను ఖర్చు చేస్తారనే ఉద్దేశ్యంతో .. మనీ అడిగినప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంటారు. 
 

నేను నా మాజీని మర్చిపోయాను

నిజానికి ఎక్స్ ను మర్చిపోవడం అంత సులువు కాదు. అందులోనూ వాళ్లు పదే పదే గుర్తొస్తున్నా, వారిని కలుస్తున్నా.. మీ భాగస్వామితో వాళ్లను మర్చిపోయాను అని చెప్పడం సరికాదు. ఈ విషయం వాళ్లకు ఎప్పుడో ఒకసారి తెలియకతప్పదు. కానీ ఇది మీ బంధం విడిపోయే దాకా తీసుకెళ్తుంది. అందుకే ఇలాంటి విషయాల్లో అస్సలు అబద్దం ఆడకండి. మర్చిపోకపోతే మర్చిపోలేకపోతున్నాను అని చెప్పండి. మర్చిపోయే మార్గాన్ని అడగండి. 

నేను చెప్పింది ఆ ఉద్దేశ్యంతో కాదు

చాలా మంది ఎప్పుడూ ఇతరులను బాధపెట్టే మాటలనే అంటుంటారు. కానీ పైకి మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో అనలేదని అంటారు. దాన్ని అబద్ధంతో  కప్పిపుచ్చాలనే అలా చెప్తారు. వీరికి ఇతరులను బాధపెట్టడం ఒక అలవాటుగా ఉంటుంది. 
 

డేటింగ్ యాప్‌లను తొలగించడం మర్చిపోయాను

మీరు మీ భాగస్వామి ఫోన్‌లో డేటింగ్ యాప్‌ ను గుర్తించినట్టైతే.. దానికి ఎందుకు ఇంకా ఉచుకున్నావ్ అని అడిగితే.. రకరకాల కారణాలు చెప్పి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టైతే.. వాళ్లు మీకు పూర్తిగా అబద్దం చెప్తున్నారని అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను దాన్ని డిలీట్ చేద్దామని మర్చిపోయాను అని చెప్పినప్పుడు.
 

నేను సింగిల్

మీరు సింగిల్ అని కనిపెట్టిన మీ భాగస్వామి నేను కూడా సింగిల్ అని చెప్తే అనుమానించండి. ఎందుకంటే వాళ్ల గురించి మీకేమీ తెలియకపోవచ్చు. వాళ్లు నిజానికి వేరే వాళ్లతో రిలేషన్ షిప్ లో ఉండొచ్చు. లేదా వివాహం చేసుకుని కూడా ఉండొచ్చు. ఇలాంటి అబద్ధం ఒక వ్యక్తని ఎంతో బాధకు గురిచేస్తుంది. 
 

click me!